ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రీరాంరెడ్డి విచారణ
ABN , Publish Date - May 26 , 2026 | 05:28 AM
రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ మరో కీలక వ్యక్తిని విచారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న ....
హైదరాబాద్, మే 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ మరో కీలక వ్యక్తిని విచారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న శ్రీరాం రెడ్డి సోమవారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరయ్యారు. కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్‌గా ఉన్న శ్రీరాంరెడ్డి కొన్నేళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి, తిరుపతిరెడ్డిలకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న నేపథ్యంలో.. ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. రేవంత్ వ్యక్తిగత, రాజకీయ కార్యక్రమాల సమాచారం ేసకరించే ఉద్దేశంతో శ్రీరాం రెడ్డి ఫోన్‌ను ట్యాప్ చేసిన అవకాశాలపై అధికారులు ఆరా తీసినట్లు తెలిసింది. శ్రీరాం రెడ్డి కాల్ డేటా, కమ్యూనికేషన్ రికార్డులు, అప్పటి ఇంటెలిజెన్స్ అధికారులతో ఉన్న సంబంధాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ప్రశ్నించినట్లు సమాచారం. కాగా, మరికొందరికి త్వరలో నోటీసులు జారీ చేసి, విచారించే అవకాశముందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.