Share News

రోహిత్‌రెడ్డి బ్యాంకు ఖాతాలపై ఆరా!

ABN , Publish Date - Apr 10 , 2026 | 05:27 AM

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసులోని నిందితులు పైలట్‌ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలను మూడో సారి కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు గురువారం పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది.

రోహిత్‌రెడ్డి బ్యాంకు ఖాతాలపై ఆరా!

  • డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలపై విచారించిన సిట్‌ అధికారులు

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): మొయినాబాద్‌ ఫాంహౌస్‌ డ్రగ్స్‌, కాల్పుల కేసులోని నిందితులు పైలట్‌ రోహిత్‌రెడ్డి, రితేశ్‌రెడ్డి, నమిత్‌ శర్మలను మూడో సారి కస్టడీకి తీసుకున్న సిట్‌ అధికారులు గురువారం పలు కీలక విషయాలను రాబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రోహిత్‌రెడ్డి బ్యాంకు ఖాతాలు, డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలు, ఆయనకున్న బ్యాంకు అకౌంట్లు, దుబాయ్‌లో ఉన్న డ్రగ్స్‌ ముఠాలతో సంబంధాలు, ఎన్ని రోజుల నుంచి డ్రగ్స్‌ దందా నడుస్తోందనే అంశాలపై సిట్‌ అధికారులు విచారించినట్లు తెలిసింది. గురువారం ఉదయం నుంచి డీసీపీ యోగేశ్‌ గౌతమ్‌, శిరీష ఆధ్వర్యంలో విచారణ జరిగింది. సాయంత్రం ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌ సుధీర్‌బాబు కూడా ముగ్గురు నిందితులను వేర్వేరుగా విచారించారు. బుధవారం రాజేంద్రనగర్‌ కోర్టులో నిందితులు బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం డిస్మిస్‌ చేసింది. మరోసారి శుక్రవారం హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని నిందితుల తరఫు న్యాయవాదులు తెలిపారు.

Updated Date - Apr 10 , 2026 | 05:27 AM