సిరిసిల్ల వాసికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Mar 05 , 2026 | 01:34 AM
గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు వలస కార్మికుల కుటుంబాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అబుదాబీ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు ....
ఆందోళనలో కుటుంబీకులు
ఎల్లారెడ్డిపేట, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు వలస కార్మికుల కుటుంబాల్లో వణుకు పుట్టిస్తున్నాయి. అబుదాబీ విమానాశ్రయంపై ఇటీవల జరిగిన దాడిలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ వలస కార్మికుడు తీవ్రంగా గాయపడడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లికి చెందిన రాజేశ్వర్‌రావు నాలుగేళ్ల క్రితం ఉపాధి కోసం అబుదాబీకి వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో పారిశుధ్య కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఈనెల 2న విమానాశ్రయంపై ఇరాన్ దాడి చేసింది. ఆ పేలుళ్ల ధాటికి రాజేశ్వర్‌రావుకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. మరోవైపు, తన భర్తను స్వగ్రామానికి తీసుకువచ్చేలా భారత రాయబార కార్యాలయం చొరవ తీసుకోవాలని రాజేశ్వర్‌రావు భార్య మీనా కోరారు.