Share News

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర

ABN , Publish Date - Jul 05 , 2026 | 05:43 AM

సర్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు.

హిందువుల ఓట్లను తొలగించే కుట్ర

  1. సర్‌ పేరిట రాష్ట్ర సర్కారు అధికార దుర్వినియోగం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌

జగిత్యాల, జూలై 4 (ఆంధ్రజ్యోతి): సర్‌ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మండిపడ్డారు. మజ్లి్‌సతో కాంగ్రెస్‌ కుమ్మక్కై హిందువుల ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోందని.. ఇదే జరిగితే తెలంగాణలో హిందువులే మైనారిటీలయ్యే ప్రమాదముందన్నారు. శనివారం జగిత్యాల జిల్లా భీమారం మండలం దేశాయిపేటలో విలేకరులతో బండి సంజయ్‌ మాట్లాడారు. సర్‌పై కింది స్థాయి అధికారులు పనిచేయడానికి సుముఖంగా ఉన్నప్పటికీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం సహకరించట్లేదని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో అధికారులు హిందువుల ఇళ్లకు పూర్తిస్థాయిలో వెళ్లడం లేదన్నారు. తెలంగాణలోని హిందువులంతా జాగృతం కావాలని, లేని పక్షంలో హిందువులంతా మైనారిటీలయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ‘కొన్ని నగరాల్లో రోహింగ్యాల ఓట్లను తొలగిస్తే ఎంఐఎం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. దానికి కాంగ్రెస్‌ వత్తాసు పలుకుతోంది. వారు రోహింగ్యాల ఓట్లతో గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలు, పెన్షన్లు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, కాంట్రాక్టర్ల బిల్లులు చెల్లించాలన్న పైసల్లేని దుస్థితి ఏర్పడింది. బీఆర్‌ఎస్‌ పాలనలో దోచుకున్న సొమ్మునంతా ఫాంహౌ్‌సకు తరలిస్తే, కాంగ్రెస్‌ పాలనలో దోచుకున్నదంతా ఢిల్లీ పెద్దలకు పంపుతున్నారు. రాష్ట్రంలో అంతో ఇంతో అభివృద్ధి జరుగుతోందంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే.. రాష్ట్రం అప్పుల ఊబి నుంచి బయటకు రావాలంటే డబుల్‌ ఇంజన్‌ సర్కారు రావాల్సిందే..’ అని సంజయ్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - Jul 05 , 2026 | 05:43 AM