Share News

సర్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి

ABN , Publish Date - Jun 27 , 2026 | 11:19 PM

ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను పారదర్శ కంగా చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు.

సర్‌ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
ఎన్యూమరేషన్‌ నమోదును పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ

- అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ

వంగూరు/ ఊర్కొండ/ తాడూరు/ తెలకపల్లి, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : ఓటరు జాబితా ప్ర త్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌)ను పారదర్శ కంగా చేపట్టాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. శనివారం మండలంలోని వంగూరు గేటు కాలనీలో ఓటర్లకు ఎన్యూమ రే షన్‌ ఫారాలను ఎమ్మెల్యే పంపిణీని పరిశీలిం చారు. ఆయన మాట్లాడుతూ బీఎల్‌వోలు వారికి కేటాయించిన పోలింగ్‌ బూత్‌ల పరిధిలో ఎన్యూ మరేషన్‌ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేసి వివ రాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. కా ర్యక్రమంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాజశే ఖర్‌రెడ్డి, భీముడునాయక్‌ పాల్గొన్నారు.

ఫ ఊర్కొండలో ఎన్యూమరేషన్‌ ప్రక్రి యను మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు కలెక్టర్‌, జడ్చర్ల నియోజకవర్గ ఈఆర్వో హరిప్రియ పరిశీలించారు. మండల కేంద్రంలో బీఎల్వోలు అందిస్తున్న ఓట రు నమోదు దరఖాస్తుల పంపిణీపై ఆరా తీశారు. ఇంటింటికీ తిరుగుతూ ఫారాలు అందిన విషయాన్ని తెలుసుకున్నారు. తహసీలా ్దర్‌ యూసుఫ్‌ అలీ, సర్పంచ్‌ మం జుల, మాజీ సర్పంచ్‌ శ్రీనివాసులు బీఎల్వోలు ఉన్నారు.

ఫ తాడూరు మండలంలో తహసీల్దార్‌ రామకృష్ణయ్య పర్యవేక్షించారు. డీటీ శ్రీనివాసు లు, ఆర్‌ఐలు సల్మాన్‌, సురేష్‌ పాల్గొన్నారు.

ఫ తెలకపల్లిలో డిప్యూటీ తహసీల్దార్‌ లక్ష్మణ్‌ ఎన్యూమరేషన్‌ పత్రాలను పంపిణీ చేశారు. కాంగ్రెస్‌ నాయకుడు సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌, సర్‌ ఇన్‌చార్జి మామిళ్లపల్లి యాదయ్య, బీఎల్‌వో తుమ్మ రాధ పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2026 | 11:19 PM