Share News

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియను పర్యవేక్షించాలి

ABN , Publish Date - Jul 21 , 2026 | 10:37 PM

సర్‌ ప్రక్రియకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పర్యవేక్షించి, ఓట్లు పోకుండా చూడాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని జోడేఘాట్‌లో జరుగుతున్న సర్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు.

kumaram bheem asifabad- సర్‌ ప్రక్రియను పర్యవేక్షించాలి
సర్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ, పాల్గొన్న నాయకులు

కెరమెరి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు పర్యవేక్షించి, ఓట్లు పోకుండా చూడాలని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. మండలంలోని జోడేఘాట్‌లో జరుగుతున్న సర్‌ ప్రక్రియను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్యూమరేషన్‌ ఫారాలు తప్పులు లేకుండా నింపి ఇవ్వాలన్నారు. అలాగే బీఎల్‌ఏ, బీఎల్‌వోలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ప్రతీ ఒక్కరు తమ పేరును ఓటరు జాబితాలో ఉండేలా కాంగ్రెస్‌ కార్యకర్తలు పర్యవేక్షించాలని చెప్పారు. ఇందుకు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి స్థాయిలో చూడాలన్నారు. అంతకు ముందు కెరమెరి మండలంలోని జోడెఘాట్‌లో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగణ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులతో కలిసి ఆదివాసి సంప్రదాయ ప్రకారం సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కుమరం భీం విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భీం ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇందిరా ఫెల్లోషిప్‌ జిల్లా కోఆర్డినేటర్‌ కోవ ఇందిర, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు సుజాయిద్‌ ఖాన్‌, పెందోర్‌ రాజేశ్వర్‌, సాదిక్‌, దేశ్‌ముఖ్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, జూలై 21 (ఆంధ్రజ్యోతి): కెరమెరి మండలం బాబేఝరి గ్రామ పంచాయతీ పరిఽధిలోని గోండ్‌గూడ వాగుపై వంతెన నిర్మాణం జరిగేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. గోండ్‌గూడ వాగును కాంగ్రెస్‌ నాయకులతో కలిసి మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు వర్షాలతో వాగు ఉప్పొంగి ఉంటుదని దీంతో రాక పోకలకు ఇబ్బందికరంగా ఉందని డీసీసీ అధ్యక్షురాలి దృష్టికి తీసుకవచ్చారు. ఈ విషయాన్ని జిల్లా ఇన్‌చార్జి మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు కోవ, సుజాయిద్‌ఖాన్‌, పెందోర్‌ రాజేశ్వర్‌, సాదిక్‌, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 21 , 2026 | 10:37 PM