సర్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 25 , 2026 | 11:10 PM
సర్ ప్రక్రి యను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆయన మండలంలో పర్యటించా రు. ముత్యంపల్లి రైతు వేదికలో జరుగుతు న్న సర్ ప్రక్రియను పరిశీలించి పలు సూ చనలు చేశారు.
కలెక్టర్ కుమార్ దీపక్
కాసిపేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి) :సర్ ప్రక్రి యను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. శుక్ర వారం ఆయన మండలంలో పర్యటించా రు. ముత్యంపల్లి రైతు వేదికలో జరుగుతు న్న సర్ ప్రక్రియను పరిశీలించి పలు సూ చనలు చేశారు.
మండలంలో సర్ ప్రక్రియ ఆలస్యంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రి యను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాల న్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాల యాన్ని సందర్శించి రికార్డులను పరిశీలిం చారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆ సుపత్రిని పరిశీలించి రోజువారీగా వస్తున్న రోగుల వివరాలను తెలుసుకున్నారు. జ్వర పీడీత గ్రామాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో వైద్య శిబిరాలను నిర్వహించాలని మెడికల్ ఆఫీసర్‌కు సూచించారు. వైద్యులు, సిబ్బం ది సమయ పాలన పాటించాలని లేకుంటే శాఖపరమైన చర్యలుంటాయన్నారు. విధు ల్లో నిర్లక్ష్యం వహించొద్దన్నారు. ఫార్మాసి స్టు పోస్టు ఖాళీగా ఉందని, మందుల కొర త ఉందని మెడికల్ ఆఫీసర్ శ్రీదివ్య కలె క్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని రకాల మందులు ఉండేలా చర్యలు తీసుకుం టా మని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో డిప్యూటీ తహసీల్దార్ అంజయ్య, అధి కారులు, సిబ్బంది పాల్గొన్నారు.