సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Sep 07 , 2026 | 10:39 PM
జిల్లాలో చేపట్టిన సర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశా ఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ర్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగి తారాణా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మం దిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.
జిల్లా ఎలక్ర్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగితారాణా
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో చేపట్టిన సర్ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్యాశా ఖ కార్యదర్శి, జిల్లా ఎలక్ర్టోరల్ రోల్ అబ్జర్వర్ యోగి తారాణా అన్నారు. సోమవారం కలెక్టర్ సమావేశ మం దిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్‌లో భాగంగా జిల్లా లో లక్షా70 వేల మ్యాపింగ్ కానీ, అనమోలిస్ ఓటర్ల సంబంధిత నోటీసులను జనరేట్ చేసామని, జనరేట్ చేసిన లక్షా10వేల నోటీసులు పంపిణీ చేసి మిగితిన 60 వేల నోటీసులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 18 ఏళ్లు నిండిన వారందరు ఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలన్నారు. నోటీసులు జారీ అయిన ప్రతి ఒక్కరు సంబంధితంచిన డాక్యుమెంట్లను సమర్పించేలా వారికి అవగాహన కల్పించాలన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును కోల్పోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్‌లు చంద్రయ్య, రాము లు పాల్గొన్నారు.
నోటీసుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలి
సర్‌లో భాగంగా నోటీసుల జారీ ప్రక్రియ వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. సోమవారం హైద్రాబాద్ నుంచి వీడియో కా న్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, అదనపు కలెక్టర్, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నో మ్యాపింగ్, అనామోలిస్ జాబితాకు సంబంధించిన ఓ టర్లకు నోటీసులు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చే సి త్వరగా పూర్తి చేయాలన్నారు. కలెక్టర్ కుమార్ దీ పక్ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 70 శాతం నోటీ సులు అందించామని, మిగిలిన నోటీసులు కూడా త్వర లోనే పూర్తిగా అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జి ల్లా అదనపు కలెక్టర్ రాములు, రెవెన్యూ అధికారి మో తిరాం, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ చంద్రకళ, ఆర్డీవో శ్రీని వాసరావు, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ పాల్గొన్నారుఏ.
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని కలెక్ట ర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరరేట్ భ న సమావేవ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో ఆర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు.