ఎస్‌ఐఆర్‌ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 12 , 2026 | 11:35 PM
ప్ర త్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గద ర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతీ ఓటరు వివరాలు జాబితా లో నమోదయ్యేలా బీఎల్‌వోలు, బీఎల్‌ఏ లు, నాయకులుచర్యలు తీసుకోవాలని మా జీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ కోరారు.
- మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్
కల్వకుర్తి, జూలై12 (ఆంధ్రజ్యోతి) : ప్ర త్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గద ర్శకాల ప్రకారం పకడ్బందీగా నిర్వహించి అర్హులైన ప్రతీ ఓటరు వివరాలు జాబితా లో నమోదయ్యేలా బీఎల్‌వోలు, బీఎల్‌ఏ లు, నాయకులుచర్యలు తీసుకోవాలని మా జీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్ కోరారు. ఆదివారం పట్టణంలోని పలు వార్డుల్లో ము నిసిపల్ వైస్ చైర్మన్ షానవాజ్‌ఖాన్‌తో కలి సి ఆయన పర్యటించి ఎస్‌ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. మాట్లాడుతూ ఓటరు జాబితా లో పేర్లు, చిరునామాలు, ఇతర వివరాలను ప్రతీ ఒక్కరు పరిశీలించుకోవాలని, అవసరమైన సవరణలు ఉంటే నిర్ణీత గడువు లోగా దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఎన్నిక ప్రక్రి య పారదర్శకంగా సమర్థవంతంగా సాగేందు కు ప్రజలు, బీఎల్‌వోలు, ప్రజాప్రతినిధులు స మన్వయంతో పని చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పుస్తకాల రాహుల్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు జమ్ముల శ్రీకాంత్ పాల్గొన్నారు.