Share News

‘సర్‌’తో కాంగ్రెస్‌ అనుకూల వర్గాల ఓట్లకు ముప్పు

ABN , Publish Date - Jun 28 , 2026 | 04:01 AM

సర్‌ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్‌ అనూకుల వర్గాల ఓట్లకు ముప్పు పొంచి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ...

‘సర్‌’తో కాంగ్రెస్‌ అనుకూల వర్గాల ఓట్లకు ముప్పు

  • బీఎల్‌ఏలు, పార్టీ నేతలు అప్రమత్తంగా ఉండాలి: జూపల్లి

ఆదిలాబాద్‌, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి): సర్‌ ప్రక్రియ ద్వారా కాంగ్రెస్‌ అనూకుల వర్గాల ఓట్లకు ముప్పు పొంచి ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రావాలన్నా.. రాహుల్‌ గాంధీ దేశానికి ప్రధాని కావాలన్నా సర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. శనివారం ఆదిలాబాద్‌ జిల్లాలో పర్యటించిన ఆయన.. పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సర్‌పై బీఎల్‌ఏలకు నిర్వహించిన అవగాహన సదస్సులో జూపల్లి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కుబలమైన ఓటు బ్యాంకు అయిన మైనార్టీ, మహిళలు, ఎస్టీ, ఎస్సీల ఓట్ల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బీఎల్‌ఏలు, పార్టీ మండల అధ్యక్షులు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యే ప్రమాదముందని హెచ్చరించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 23 లక్షల పైచిలుకు ఓట్లకు గాను 18 లక్షల ఓట్లు మాత్రమే మ్యాపింగ్‌ చేశారన్నారు. అనంతరం ఆదిలాబాద్‌ పట్టణంలోని 23వ వార్డు తాటిగూడలో ఇందిరమ్మ పథకం కింద నిర్మించిన ఇళ్లకు లబ్ధిదారులతో కలిసి మంత్రులు జూపల్లి, అజారుద్దీన్‌, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ గృహ ప్రవేశాలు నిర్వహించారు.

Updated Date - Jun 28 , 2026 | 04:01 AM