Share News

లక్ష్యం దిశగా ’సర్‌’

ABN , Publish Date - Aug 04 , 2026 | 10:58 PM

దేశవ్యాప్తంగా కేంధ్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా డిజిటైజేషన్‌ (ఆన్‌లైన్‌) ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది.

లక్ష్యం దిశగా ’సర్‌’

-పూర్తి కావస్తున్న మ్యాపింగ్‌

-నియోజక వర్గాల వారీగా ఓటర్ల సర్దుబాటు

-పదో తేదీతో ముగియనున్న ప్రక్రియ

-జిల్లాలో 83.15 శాతం పూర్తయిన ఆన్‌లైన్‌ నమోదు

మంచిర్యాల, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కేంధ్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా డిజిటైజేషన్‌ (ఆన్‌లైన్‌) ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా ఓ టర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. గత నవంబర్‌ నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించగా, ఇప్పటి వరకు 83.15 శాతం ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 10వ తేదీతో ’సర్‌’ గడువు ముగుస్తున్నందున నూరు శాతం లక్ష్యం చేరేందుకు యంత్రాంగం అలుపెరగకుండా శ్రమ పడుతున్నా రు. ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా అర్హులైన ఓటర్ల న మోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపడుతున్నారు.

లక్ష్యం దిశగా....

జిల్లాలో ప్రస్తుతం ’సర్‌’ ప్రక్రియ లక్ష్యం దిశగా సాగుతోంది. జూన్‌ నెలలో ’సర్‌’ ప్రక్రియ ప్రారంభంకాగా, అంతకు ముం దు బీఎల్‌వోలు మ్యాపింగ్‌ దశను పూర్తి చేశారు. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితా విడుదల చేయాలనే సంకల్పంతో ఎన్ని కల సంఘం ’సర్‌’కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ప కడ్బంధీగా సర్వే నిర్వహించి నియోజక వర్గాల వారీగా ఓటరు జాబితాలను తయారు చేయడం కోసం ముందుగా మ్యాపింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ’సర్‌’ను జూన్‌ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధికారులు, సూపర్‌ వైజర్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబితా ప్రత్యేక సవ రణ చేపట్టారు. ముసాయిదా ఓటర్ల జాబితాను డిజిటైజేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ప్రకటిస్తారు. తుది ఓటర్ల జాబితాలను అక్టోబర్‌ 1న విడుదల చేస్తారు. డిజిటైజేషన్‌ ప్రక్రియను ప్రతి శాసనసభ నియోజక వర్గానికి ఒక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీ సర్‌ (ఈఆర్‌వో) పర్యవేక్షిస్తున్నారు. వీరికి తోడుగా ప్రతి మండ లానికి ఒక ఏఈఆర్‌వో (తహసీల్దార్‌) పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

నాలుగు విభాగాలుగా మ్యాపింగ్‌...

’సర్‌’-2025లో భాగంగా ఓటరు జాబితాను నాలుగా విబా గాలుగా వర్గీకరించి మ్యాపింగ్‌ చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభజించారు. ముం దుగా 2025 ఓటరు జాబితాను 2002, ఓటరు జాబితా ప్రకా రం సరిపోల్చి, అంటే ఏ కేటగరీలో 2002, 2025 జాబితాల్లో పేర్లు ఉన్నవారిని గుర్తించారు. ఇక బీ కేటగరీలో 38 సంవ త్సరాల (1987 జూలై 1కంటే ముందు జన్మించినవారు) వయ స్సున్న వారిని గుర్తించి వివరాలు నమోదు చేశారు. సీ కేటగి రీలో 1987 నుంచి 2001 మధ్య జన్మించిన వారిని గుర్తించారు. డీ కేటగరీలో 18-21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారిని గుర్తించి, మొబైల్‌ యాప్‌లో డిజిటైజేషన్‌ చేపడుతున్నారు. ఓటర్ల జాబి తాలో ఖశ్చితత్వం, పారదర్శకత, సమస్యలకు సకాలంలో పరి ష్కారానికి రాజకీయ పార్టీల పక్షాన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏ జెంట్లను నియమించుకునేందుకు ఎన్నికల సంఘం అనుమ తిని ఇచ్చింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జి ల్లాలోని ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒకరి చొప్పున ఏజెంట్‌ను ని యమించాయి. బూత్‌ స్థాయిలో క్రియాశీల కార్యకర్తలను ఎం పిక చేసి పని అప్పగించారు. పోలింగ్‌ బూత్‌ల పరిధిలో జరిగే ఓటరు మ్యాపింగ్‌, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై అభ్యంతరాలు, ఓటర్ల తొలగింపు, చేర్పులపై సందేహాలను ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.

జిల్లాలో 6.5 లక్షల పై చిలుకు ఓటర్లు...

ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్రకారం 5-2-2026 నాటికి జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో మొత్తం 6,58, 880 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 3,25,592 మంది ఉండగా స్త్రీలు 3,33,242 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు 46 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బలగాలు) ఓటర్లు మరో 683 మంది ఉన్నారు. ’సర్‌’ ప్రక్రియ లో భాగంగా ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా మూడు నియో జక వర్గాల పరిధిలో 83.15 శాతం డిజిటైజేషన్‌ పూర్తయింది. మంచిర్యాల నియోజక వర్గంలోని మంచిర్యాల మునిసిపల్‌ కా ర్పొరేషన్‌తోపాటు హాజీపూర్‌, లక్షెట్టిపేట, దండేపల్లి మండలా ల్లో 76.03 శాతం డిజిటైజేషన్‌ పూర్తికాగా, బెల్లంపల్లి నియో జకవర్గం పరిధిలోని కాపేట, బెల్లంపల్లి, తాండూరు, కన్నెపల్లి, భీమిని, వేమనపల్లి, నెన్నెల మండలాల్లో 87.80 శాతం, చె న్నూరు నియోజకవర్గం పరిధిలోని జైపూర్‌, భీమారం, చెన్నూ రు, కోటపల్లి, మందమర్రి మండలాల్లో 85.62 శాతం డిజిటై జేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మరో ఐదు రోజులు సమయం ఉండటంతో డిజిటైజేషన్‌ పర్సెంటేజ్‌ పెరిగే అవకాశం ఉంది.

Updated Date - Aug 04 , 2026 | 10:58 PM