Share News

ముగిసింది ’సర్‌’

ABN , Publish Date - Aug 18 , 2026 | 11:06 PM

దేశ వ్యాప్తంగా కేంధ్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా డిజిటలైజేషన్‌ (ఆన్‌లైన్‌) ప్రక్రియ జిల్లాలో ఈ నెల 17వ తేదీతో పూర్తయింది.

ముగిసింది ’సర్‌’

-జిల్లాలో పూర్తయిన డిజిటలైజేషన్‌

-నియోజకవర్గాల వారీగా ఓటర్ల సర్దుబాటు

-జిల్లా వ్యాప్తంగా లక్షపై చిలుకు ఓట్ల రద్దు

-తుది ఓటర్ల సంఖ్య విడుదల చేసిన అధికారులు

మంచిర్యాల, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యాప్తంగా కేంధ్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) కార్యక్రమంలో భాగంగా డిజిటలైజేషన్‌ (ఆన్‌లైన్‌) ప్రక్రియ జిల్లాలో ఈ నెల 17వ తేదీతో పూర్తయింది. దేశవ్యాప్తంగా ఓ టర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంధ్రం ప్రత్యేక కార్యక్ర మాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. గత నవంబర్‌ నుంచే జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించగా, ఎట్టకేలకు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 10వ తేదీతో ’సర్‌’ గడువు ముగియగా, నూరు శాతం లక్ష్యం చేరేందుకు యంత్రాంగం అలుపెరగకుం డా శ్రమించి, డిజిటలైజేషన్‌ ప్రక్రియను ముగించారు. ప్రత్యేక ఓటర్ల సవరణలో భాగంగా అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపట్టి, తుది ఓటర్ల సంఖ్యను వెల్లడించారు.

అర్హులైన ఓటర్లతో జాబితా....

జిల్లాలో ప్రస్తుతం ’సర్‌’ ప్రక్రియ లక్ష్యం దిశగా సా గుతోంది. జూన్‌ నెలలో ’సర్‌’ ప్రక్రియ ప్రారంభంకాగా, అంతకు ముందు బీఎల్‌వోలు మ్యాపింగ్‌ దశను పూర్తి చేశారు. అర్హులైన ఓటర్లతో కొత్త జాబితా విడుదల చేయాలనే సంకల్పంతో ఎన్నికల సంఘం ’సర్‌’కు శ్రీ కారం చుట్టింది. ఇందులో భాగంగా పకడ్బంధీగా సర్వే నిర్వహించి నియోజక వర్గాల వారీగా ఓటరు జాబితాల ను తయారు చేయడం కోసం ముందుగా మ్యాపింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో ’సర్‌’ను జూన్‌ 25 నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు బూత్‌ స్థాయి అధి కారులు, సూపర్‌ వైజర్లు ఇంటింటికి తిరిగి ఓటర్ల జాబి తా ప్రత్యేక సవరణ చేపట్టారు. ముసాయిదా ఓటర్ల జాబితాను డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తికాగానే ప్రకటి స్తారు. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్‌ 1న విడుదల చేస్తారు. డిజిటలైజేషన్‌ ప్రక్రియను ప్రతి శాసనసభ ని యోజక వర్గానికి ఒక ఎలక్టోరల్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీసర్‌ (ఈఆర్‌వో) పర్యవేక్షించగా, వీరికి తోడుగా ప్రతి మండలానికి ఒక ఏఈఆర్‌వో (తహసీల్దార్‌) పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు.

నాలుగు విభాగాలుగా మ్యాపింగ్‌...

’సర్‌’-2025లో భాగంగా ఓటరు జాబితాను నాలుగా విభాగాలుగా వర్గీకరించి మ్యాపింగ్‌ చేపట్టారు. ఎన్నికల సంఘం ఆదేశం మేరకు ఏ,బీ,సీ,డీ గ్రూపులుగా విభ జించారు. ముందుగా 2025 ఓటరు జాబితాను 2002, ఓటరు జాబితా ప్రకారం సరిపోల్చి, అంటే ఏ కేటగరీలో 2002, 2025 జాబితాల్లో పేర్లు ఉన్నవారిని గుర్తించారు. ఇక బీ కేటగరీలో 38 ఏళ్ల (1987 జూలై ఒకటవ తేదీ కంటే ముందు జన్మించినవారు) వయస్సున్న వారిని గుర్తించి వివరాలు నమోదు చేశారు. సీ కేటగరీలో 1987 నుంచి 2001 మధ్య జన్మించిన వారిని గుర్తించా రు. డీ కేటగరీలో 18-21 ఏళ్ల మధ్య వయసు ఉన్నవా రిని గుర్తించి, మొబైల్‌ యాప్‌లో డిజిటలైజేషన్‌ చేపడు తున్నారు. ఓటర్ల జాబితాలో ఖచ్చితత్వం, పారదర్శకత, సమస్యలకు సకాలంలో పరిష్కారానికి రాజకీయ పార్టీ ల పక్షాన పోలింగ్‌ బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమిం చుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతిని ఇచ్చింది. దీంతో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు జిల్లాలోని ప్రతి పోలింగ్‌ బూత్‌కు ఒకరి చొప్పున ఏజెంట్‌ను నియమించాయి. బూత్‌ స్థాయిలో క్రియాశీల కార్యకర్త లను ఎంపిక చేసి పని అప్పగించారు. పోలింగ్‌ బూ త్‌ల పరిధిలో జరిగే ఓటరు మ్యాపింగ్‌, ఎస్‌ఐఆర్‌ ప్ర క్రియపై అభ్యంతరాలు, ఓటర్ల తొలగింపు, చేర్పులపై సందేహాలను ఎన్నికల అధికారులకు ఏజెంట్లు ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించారు.

జిల్లాలో లక్ష పై చిలుకు ఓట్ల రద్దు...

’సర్‌’ ప్రక్రియ కారణంగా ప్రస్తుతానికి జిల్లా వ్యాప్తం గా లక్షా 11వేల 150 ఓట్లు రద్దయ్యాయి. ఇందులో మరణించినవారు, రెండు చోట్లా ఓటు కలిగి ఉన్న వారి ని అధికారులు తొలగించారు. కొత్తగా నమోదైన ఓట్లతో కలిపి తుది ఓటరు జాబితాను విడుదల చేయను న్నారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం ప్ర కారం 5-2-2026 నాటికి జిల్లాలోని మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి మూడు అసెంబ్లీ నియోజక వర్గాల పరి ధిలో మొత్తం 6,58,880 మంది ఓటర్లు ఉన్నారు. వీరి లో పురుషులు 3,25,592 మంది ఉండగా స్త్రీలు 3,33,242 మంది ఉన్నారు. వీరితో పాటు ఇతరులు 46 మంది ఉండగా, ఎన్‌ఆర్‌ఐ, సర్వీసు (దేశ భద్రత బల గాలు) ఓటర్లు మరో 683 మంది ఉన్నారు. ప్రస్తుతం సవరించిన జాబితా ప్రకారం ఈనెల 17వ తేదీ నాటికి జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య 5 లక్షల 47వేల 730 ఉంది. అందులో చెన్నూరు నియోజక వర్గంలో మొత్తం 1,69,483 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 84,266, స్త్రీలు 85,210, ఇతరులు ఏడుగురు ఉన్నారు. వీరికి అధనంగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 03, సర్వీస్‌ ఓటర్లు 150 మంది ఉన్నారు. అలాగే బెల్లంపల్లి నియోజక వర్గంలో మొత్తం ఓటర్లు 1,59,192 మంది ఉండగా వీరిలో పురుషులు 79,183, స్త్రీలు 79,999, ఇతరులు 10 మంది ఉన్నారు. వీరికి అదనంగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 01, సర్వీస్‌ ఓటర్లు 187 మంది ఉన్నారు. మంచిర్యాల ని యోజక వర్గంలో మొత్తం 2,18,324 మంది ఉండగా వీరిలో పురుషులు 1,07,978, స్త్రీలు 1,10,332, ఇతరులు 14 మంది ఉన్నారు. వీరికి అదనంగా ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు 08 మంది, సర్వీస్‌ ఓటర్లు 394 మంది ఉన్నారు.

Updated Date - Aug 18 , 2026 | 11:06 PM