Share News

kumaram bheem asifabad- ‘సర్‌’.. కష్టాలు..

ABN , Publish Date - Jul 02 , 2026 | 10:41 PM

కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెష ల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకు వచ్చింది. కుమరం భీం ఆసి ఫాబాద్‌ జిల్లాలో ఓటర్ల సవరణలో భాగంగా బీఎల్‌వోలు ఓటర్లందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి వారంలో తిరిగి ఇవ్వాలని చెబుతు న్నట్లు ఓటర్లు చెబుతున్నారు.

kumaram bheem asifabad- ‘సర్‌’.. కష్టాలు..
లోగో

- ఫారాలు పంపిణీ చేస్తున్న బీఎల్‌వోలు

- జిల్లాలో 3,96,942 మంది ఓటర్లు

చింతలమానేపల్లి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. బోగస్‌, డబుల్‌ ఎంట్రీ ఓటర్లను తొలగించడం కోసం చేపట్టిన స్పెష ల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ ప్రక్రియ పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా అలజడి, సందేహాలను ఓటర్ల ముంగిటకు తీసుకు వచ్చింది. కుమరం భీం ఆసి ఫాబాద్‌ జిల్లాలో ఓటర్ల సవరణలో భాగంగా బీఎల్‌వోలు ఓటర్లందరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలు పంపిణీ చేసి వారంలో తిరిగి ఇవ్వాలని చెబుతు న్నట్లు ఓటర్లు చెబుతున్నారు. కానీ వాటిపై పూర్తి స్థాయిలో ఓటర్లకు ఫారాలు ఫిల్‌ చేసే విధానం తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వాపోతున్నారు. ప్రస్తుతం చాలా మందికి ఎస్‌ఐఆర్‌ ఫారం నింపడం సమస్యగా మారింది. ఎన్యూమ రేషన్‌ ఫారాలను ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకారం భర్తీ చేసి బీఎల్‌వోలకు ఇస్తే ఫారాలను డిజిటలైజేషన్‌ చేస్తారు. కానీ ఓటర్లు ఈఎఫ్‌ ఫారా లను నింపేందుకు సరైన అవగాహన లేక నింపలేక పోతున్నామని చెబుతున్నారు.

- రెండు నియోజకవర్గాల పరిధిలో..

జిల్లాలో రెండు శాసన సభ నియోజకవర్గాల పరిధిలో 3,96,942 మంది ఓటర్లు ఉన్నారు. ఇందు లో ఆసిఫాబాద్‌ లో 2,26,778 మంది ఓటర్లు, సిర్పూర్‌లో 1,70,164 మంది ఓటర్లు ఉన్నారు. వీరం దరికీ ఎన్యూమరేషన్‌ ఫారాలను అందిస్తున్నారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ జిల్లాలో పకడ్భందీగా పూర్తి చేసే దిశగా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సమా వేశాలు ఏర్పాటు చేయడం, పోలింగ్‌ బూత్‌ స్థాయి లు పరిశీలించడం వంటి కార్యక్రమాలు చేస్తున్నారు. జిల్లాలోని ఎన్యూమరేషన్‌ పొందిన ఓటర్లలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇచ్చిన ఫార్మాట్‌లో వివరాలు ఎలా నమోదు చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు. ఫారాలను బీఎల్‌వోలు, ఽఅదికారులు పంపిణీ చేస్తున్నప్పటికీ ఫారాలు ఎలా నింపాలో అర్ధం కావడం లేదంటు న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరక్షరాస్యులకు ఫారం ఎలా నింపాలో తెలియక చదువుకున్న వారి చుట్టూ తిరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఫారం నింపుకోవడంలో గ్రామీణ ప్రాం తాల్లో పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- బాధ్యత ఓటర్లదే..

జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న సర్‌ ప్రక్రియలో భాగంగా ఓటు హక్కును కాపాడుకొనే బాధ్యత ఓటర్లపైనే ఉంది. ప్రధానంగా 2002 తర్వాత అత్తవారింట్లో అడుగుపెట్టిన కొత్త కోడళ్లు ఓటును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇతర ప్రాంతాల నుంచి అత్తవారింట్లో అడుగుపెట్టిన యువతుల ఇంటి పేరు మారతుంది. కానీ స్పెషల్‌ ఇంటెన్స్‌ రివిజన్‌ కోడళ్ల వంశవృక్షాన్ని తెలుసుకోవాలని అను కుంటుంది. 2002లో సర్‌ ప్రక్రియలో ఏ నియోజక వర్గంలో ఉన్నారో స్పష్టంగా నయోదు చేయాలి. తమ తల్లిదండ్రుల ఓటరు జాబితా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యువతుల వివరాలు తెలియక ఇబ్బం దులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చుదువుకున్నవారు గతంలో ఓటు హక్కు వివరాలు తెలిసిన వారైతే నమోదు చేస్తున్నారు. వివరాలు తెలియని నిరక్షరాస్యులకు ప్రశ్నార్ధకంగానే నిలుస్తోంది.

- మొదటి కాలంలో..

ఓటరు ప్రక్రియ సవరణ ఎన్యూమరేషన్‌ ఫారం మొదటి కాలంలో 2002 నాటి ఓటరు వివరాలు తప్పని సరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. తాజా గా ఓటర్‌ జాబితాలో పేరు ఉన్నప్పటికీ 2002 ఓట ర్‌ జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవ డానికి ఓటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్నికల కమిషన్‌ ఫోర్టల్‌లో, బీఎల్‌వోల వద్ద పాత ఓటర్ల జాబితా పీడీఎఫ్‌ రూపంలో ఉంది. మొబైల్‌లో చూసి వివరాలు చెబుతున్నారు. 2002 తర్వాత ఓ టు హక్కు పొందితే వారి తల్లిదండ్రుల ఓటర్‌ జాబి తాలో మ్యాపింగ్‌ చేస్తున్నారు. ఎన్యూమరేషన్‌ ఫారా లకు తల్లిదండ్రుల ఓటర్‌ వివరాలు ఎంటర్‌ చేయా ల్సి ఉంటుంది. ప్రస్తుతం పిల్లల ఓట్లు మరో చోట నమోదు చేసుకుంటే ఆ వివరాలు తెలుసుకోవడా నికి ఇబ్బందులు పడుతున్నారు.

Updated Date - Jul 02 , 2026 | 10:41 PM