Share News

సర్‌ డిజిటలైజేషన్‌ వేగవంతంగా చేపట్టాలి

ABN , Publish Date - Sep 30 , 2026 | 11:34 PM

ఎస్‌ఆర్‌ఎస్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేసి నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వోడాల రాములు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆదేశించారు.

   సర్‌ డిజిటలైజేషన్‌ వేగవంతంగా చేపట్టాలి
ధండేపల్లిలో ఎస్‌ఆర్‌ఎస్‌ నమోదు తీరుపై ఆరా తీస్తున్న అదనపు కలెక్టర్‌ రాములు

అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వోడాల రాములు

దండేపల్లి, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఆర్‌ఎస్‌(సర్‌) ప్రక్రియలో భాగంగా డిజిటలైజేషన్‌ ప్రక్రియను పారదర్శకంగా వేగవంతం చేసి నిర్ధేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) వోడాల రాములు రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆదేశించారు. బుధవారం దండేప ల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆయన సందర్శించి అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటికి నిర్వహించిన విచారణలకు సంబంధించిన కేసుల డిజటలైజేషన్‌ను వేగవంతం చేయాలని, రెండు రో జుల్లోగా పురోగతి సృష్టంగా కనిపించేలా చర్యలు చేపట్టాలన్నారు. సాదా బై నామా, భూభారతీ దరఖాస్తుల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులల ఆదారంగా నిబంధపల మేరకు వాటి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, డీటీ మాధవి ఆర్‌ఐ భూమన్న రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 30 , 2026 | 11:34 PM