kumaram bheem asifabad- పకడ్బందీగా ‘సర్’
ABN , Publish Date - Jun 24 , 2026 | 10:26 PM
దేశ వ్యా ప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కార్యక్రమం జిల్లాలో పకడ్బందీ గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపడుతున్నారు.
- నేటి నుంచి బీఎల్‌వోల ఇంటింటి సందర్శన
- జిల్లాలో 4.55 లక్షల ఓటర్లు
ఆసిఫాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): దేశ వ్యా ప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కార్యక్రమం జిల్లాలో పకడ్బందీ గా కొనసాగుతోంది. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని రెండు నియోజకవర్గాల పరిధిలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ఓటర్ల నమోదు, తప్పుల సవరణ, ఓట్ల తొలగింపు ప్రక్రియలు చేపడుతున్నారు.
- ముమ్మరంగా మ్యాపింగ్..
అర్హులంత ఓటరు జాబితాలో ఉండి మరణించిన రెండు కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు కలిగిన వారిని తొలగించేందుకు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టారు. ఇప్పటికే బీఎల్‌ఓలు 2002 ఓటరు జాబి 2025 ఓటరు జాబితాను పోల్చీ మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. జిల్లాలో 82.94 శాతం మ్యాపింగ్ ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో మొత్తం 4, 55, 596 మంది ఓటర్లు ఉండగా 3,77,868 ఓటర్లకు సంబందించిన మ్యాపింగ్ ప్రక్రియ పూర్తికాగా ఇంకా 77,728 మంది మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఇందులో మ్యాపింగ్ అయిన వారిలో 1,09,093 ఓటర్ల వివరాలను మరో సారి పునః పరిశీలించాల్సి ఉంది. బీఎల్‌వోలు ఇంటిం టికీ వెళ్లి పునః పరిశీలన చేపట్టనున్న నేపథ్యంలో వారి దృష్టికి తీసుకువెళ్లి మ్యాపింగ్ సరిచేసుకోవచ్చు.
- ముసాయిదా తర్వాత..
ముసాయిదా తర్వాత ఎన్నికల సంఘం ఓటరు తుది జాబితా ప్రకటించనుంది. దీని కోసం గురువా రం నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటికి సందర్శించి వివరాలను మరోసారి పునః పరిశీలిం చనున్నారు. జిల్లాలోని 678 పోలింగ్ కేంద్రాల పరిధిలో 678 మంది బీఎల్‌వోలను నియమించారు. వీరే కాకుండా సూపర్‌వైజర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరికి శిక్షణ కూడా నిర్వహిం చారు. మూడు విడతలుగా బీఎల్‌వోలు ఇంటింటికి సందర్శించి భర్తీ చేసిన ఫారాల్లో ఒకటి బీఎల్‌వోలకు తిరిగి ఇచ్చి మరో దానిని ఓటరు వద్ద ఉంచుకోవల్సి ఉంటుంది. 18 ఏళ్లు నిండిన వారికి ఫారం-6 అందిం చనున్నారు. మరణించిన, వలస వెళ్లిన, చిరునామా మారిన రెండు, మూడు చోట్ల ఓటుహక్కు కలిగిన వాటిని గుర్తించి నోటీసులు జారీ చేసి ఓటరు జాబితా నుంచి ఓటర్లను తొలగించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
షెడ్యూల్ ఇలా..
- జూన్ 25 నుంచి జూలై 24 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శన
- జూలై 24న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ
- జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ
- ఆగస్టు 30 వరకు అభ్యంతరాల స్వీకరణ
- సెప్టెంబరు 28 వరకు అభ్యంతరాల పరిష్కారం
- అక్టోబరు 1న ఓటరు తుది జాబితా ప్రచురణ