Share News

దయనీయ స్థితిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు...!

ABN , Publish Date - Aug 22 , 2026 | 11:30 PM

గ్రామీణ పిల్లలను బడిబాట పట్టించడంలో ప్రాథమిక పాఠశా లలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రైమరీ స్కూళ్లలో ప నిచేసే ఉపాధ్యాయులే విద్యారంగానికి పునాది అనడం లో ఎలాంటి అతిశయోక్తిలేదు. అటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుని కారణంగా అత్యంత ద యనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, ఏ రోజు ఎక్కడ విధులు నిర్వహించాల్సి వస్తుందో తెలియని మానిసిక ఒత్తిడికి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు) గురవుతున్నారు.

దయనీయ స్థితిలో ఏకోపాధ్యాయ పాఠశాలలు...!
. జైపూర్‌ మండలం బోడగూడెంలోని ఏకోపాధ్యాయ పాఠశాల

-ప్రైమరీ స్కూల్‌ టీచర్ల నియామకంలో తీవ్ర జాప్యం

-అమలుగాని విద్యాహక్కు చట్టం నిబంధనలు

-టీచర్ల సర్దుబాటుతో పాఠశాలల మనుగడ ప్రశ్నార్థకం

-ఏ రోజు ఎక్కడ విధులు కేటాయిస్తారోనన్న ఒత్తిడిలో ఎస్జీటీలు

-తెరపైకి జీవో 25 సవరించాలనే డిమాండ్‌లు

మంచిర్యాల, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ పిల్లలను బడిబాట పట్టించడంలో ప్రాథమిక పాఠశా లలు కీలక పాత్ర పోషిస్తాయి. ప్రైమరీ స్కూళ్లలో ప నిచేసే ఉపాధ్యాయులే విద్యారంగానికి పునాది అనడం లో ఎలాంటి అతిశయోక్తిలేదు. అటువంటి ప్రాథమిక పాఠశాలలు ఏకోపాధ్యాయుని కారణంగా అత్యంత ద యనీయ స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా, ఏ రోజు ఎక్కడ విధులు నిర్వహించాల్సి వస్తుందో తెలియని మానిసిక ఒత్తిడికి సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీలు) గురవుతున్నారు. విద్యాహక్కు చట్టం నిబంధనల ప్రకా రం విద్యార్థుల సంఖ్యతో పనిలేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలలో కనీసం ఇద్దరు ఎస్జీటీలు ఉండాలి. సున్నా నుంచి 60 మంది వరకు ఇద్దరు ఎస్జీటీలు విధులు ని ర్వహించాలి. ఆపైన విద్యార్థులున్న చోట విద్యార్థి-టీచర్‌ రేషియో 30:1 (30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు) ఉండాలి. కానీ క్షేత్రస్థాయిలో ఆ నిబంధన అ మలు కావడం లేదు. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ఒకే టీచర్‌ పని చేస్తున్న స్కూళ్లు అనేకం ఉ న్నాయి. పైగా విద్యాహక్కు చట్టానికి వక్రభాష్యం పలు కుతూ ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారు. ఫలి తంగా ఏకోపాధ్యాయ పాఠశాలల సంఖ్య క్రమేపీ పెరు గుతోంది. ఇదిలా ఉండగా ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్న చోట కూడా నాణ్యమైన విద్య సాధ్యం కావ డం కావడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. ప్రాథమిక పాఠశాలల్లో ఐదు తరగతుల వరకు 18 సబ్జెక్టులు ఉంటాయి. వాటన్నంటినీ కేవలం ఇద్దరు టీచర్లు బోధిస్తుండటంతో నాణ్యమైన విద్య ఎలా సా ధ్యమన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సర్దుబాటులో భా గంగా ఉన్న ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరిని ఖాళీ ఉ న్న చోటకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు. ఈ క్ర మం లో ఒకే ఉపాధ్యాయుడితో పాఠశాలలు నడవాల్సిన ప రిస్థితులు ఉన్నాయి. ఇద్దరు ఉన్నచోటనే అన్ని సబ్జె క్టులు బోధించడం సాధ్యం కాదంటున్న పరిస్థితుల్లో ఒక ఉపాధ్యాయుడు పాఠశాలను ఎలా నిర్వహిస్తా డనేది ప్రశ్నగా మిగులుతోంది.

బోధనేతర పనులతో....

మరోవైపు ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) పేరుతో ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీంలు, వి ద్యాశాఖ అధికారులు పర్యవేక్షణ పేరుతో హడలెత్తిస్తు న్నారనే అభిప్రాయాలు ఉన్నాయి. ఇందులో భాగంగా విద్యార్థుల్లో అర్థవంతమైన చదువు, బేసిక్‌ మ్యాథ్స్‌లో అవగాహనపై తనిఖీలు చేపడుతూ టార్గెట్లు విధిస్తు న్నారు. అసలే ఉపాధ్యాయుల కొరతతో అంగలారుస్తు న్న ప్రైమరీ స్కూళ్లలో టార్గెట్లు ఎలా చేరుకుంటామ నే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బోధనేతర పను ల కారణంగా ప్రతి రోజూ మొదటి పీరియడ్‌ వృధా అవుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

వలంటీర్‌ వ్యవస్థకు మంగళం....

ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో విద్యా వలంటీర్ల ని యామకాలు చేపట్టేవారు. గత ప్రభుత్వ హయాం నుంచే ఆ వ్యవస్థకు మంగళం పలికారు. దీంతో సమ స్యలకు పరిష్కారం లభించడం లేదు. విద్యా వలంటీ ర్‌లను మెటర్నిటీ, లాంగ్‌ లీవ్‌, ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానంలో నియమించేవారు. దీంతో రెగ్యులర్‌ ఉ పాధ్యాయుల స్థానాన్ని విద్యావలంటీర్లు భర్తీ చేసే వా రు. తద్వారా విద్యార్థులకు ఎప్పటికప్పుడు పాఠ్యాంశాల బోధన సక్రమంగా జరిగేది. ప్రస్తుతం ఆ వ్యవస్థకు ముగింపు పలకడంతో స్థానాల భర్తీకి అవకాశం లేకుం డా పోయింది. మరోవైపు సర్దుబాటుల కారణంగా ఒక ఎస్జీటీకి శాశ్వత పాఠశాల అనేది లేకుండా పోయింది. ఒక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 20కి తగ్గిన మరు క్షణమే అక్కడ పని చేస్తున్న అదనపు ఉపాధ్యాయు లను మరో చోటుకు డిప్యుటేషన్‌పై పంపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయునికి మించి విధుల్లో ఉండటం లేదు. అలా ఒకే టీచర్‌తో బోధన గావించాల్సి వస్తుండగా, రాష్ట్రంలో ఐదువేల వ రకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. మంచిర్యా ల జిల్లాలోనే 200 వరకు ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉండగా, కొత్త నియామకాలు చేపట్టకపోవడంతో వాటి పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం వెలువడిన జీవో 25 ముఖ్యంగా ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టుగా మారిందన్న చర్చ జరుగుతోంది.

జీవో 25ను సవరించాలి...

ఆళ్ల రాజేంధర్‌, ఎస్జీటీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి

అన్ని ప్రాథమిక పాఠశాలల్లో కనీసం ఇద్దరు ఎస్జీటీ లు ఉండాలి. అలాగే నర్సరీ నుంచి 5వ తరగతి వరకు సబ్జెక్ట్‌కు ఒక టీచర్‌, ఒక హెచ్‌ఎంను ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ ప్రారంభించాలి. సింగిల్‌ టీచ ర్‌ కారణంగా ప్రాథమిక విద్య లక్ష్యం నెరవేరడం లేదు. ఉపాధ్యాయుల సర్దుబాటు కోసం జారీ చేసిన జీవో 25ను తక్షణమే సవరించాలి.

ఫఇది జైపూర్‌ మండలం బోడ గూడెం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల. ఇందులో ప్రస్తుతం 15 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ విద్యా హక్కు చట్టం అమలు కావడం లేదు. ఇద్దరు టీచర్లు తప్పనిసరిగా ఉండాల్సి ఉండగా, కేవలం ఒకే ఒక్క ఉపాధ్యాయుడు విధులు నిర్వహిస్తున్నారు. ఉపాధ్యా యుడు ఆరోగ్యం బాగోలేకనో, ఇతరత్రా పనుల నిమి త్తం సెలవు పెడితే మరో టీచర్‌కు డిప్యుటేషన్‌ ఇస్తు న్నారు. ఆ వచ్చే ఉపాధ్యాయుడు తాత్కాలికం కావడం తో మొక్కుబడిగా విధులు నిర్వహించే అవకాశం ఉంది.

ఫనెన్నెల మండలంలోని దుబ్బపల్లి (ఎం), గుడి పేట, పొట్యాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 20 లోపు విద్యార్థులు ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఒకే ఒ క్క టీచర్‌ చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. ఆ పా ఠశాలల్లోనూ విద్యాహక్కు చట్టం అమలు కావడం లే దు. అవసరమైనప్పుడు డిప్యుటేషన్‌పై టీచర్లను కేటా యిస్తున్నారు.

ఫభీమారం మండలం ధర్మారం పంచాయతీ పరి ధిలోని రెడ్డిపల్లి గ్రామంలో ఏకోపాధ్యాయ పాఠశాల కొన్నేళ్లుగా కొనసాగుతుంది. అక్కడ 10 మంది విద్యా ర్థులు ఉన్నారు. ఇక్కడ పని చేస్తున్న రెగ్యులర్‌ టీచర్‌ అకా డమిక్‌ ఇన్‌స్పెక్షన్‌ టీం కోసం దరఖాస్తు చేసుకో గా అనుమతి లభించింది. అతను ఇన్‌స్పెక్షన్‌ విధులకు హా జరైన సమయంలో విద్యార్థులకు బోధించేందుకు టీ చర్‌ అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ ని బంధనల మేరకు సింగిల్‌ టీచర్‌ ఉన్న స్కూల్‌ నుంచి అ కాడమిక్‌ ఇన్‌స్పెక్షన్‌ కోసం అనుమతి ఇవ్వరాదు. అయినప్పటికీ అక్కడి ఉపాధ్యాయునికి అనుమతి లభించడం గమనార్హం.

Updated Date - Aug 22 , 2026 | 11:30 PM