Share News

kumaram bheem asifabad-ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు

ABN , Publish Date - Jul 18 , 2026 | 11:02 PM

వినియోగదారులకు సులభతరమైన వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే లక్ష్యంతో టీజీఎన్‌పీడీసీఎల్‌ సంస్థ బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య సముదాయలకు బల్క్‌, మల్టిపుల్‌ అప్లికేషన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అందుబా టులోకి తీసుకొచ్చింది. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే సంబంధిత అధికారులు ఎస్టీమేషన్‌ ప్రతిపాదనలు రూపొందించిన దాని ప్రకారం రుసుము చెల్లించే వారు. ఈ విధానాన్ని సవరిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.

kumaram bheem asifabad-ఒకే దరఖాస్తు.. బహుళ కనెక్షన్లు
లోగో

కాగజ్‌నగర్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): వినియోగదారులకు సులభతరమైన వేగవంతమైన, పారదర్శక సేవలు అందించే లక్ష్యంతో టీజీఎన్‌పీడీసీఎల్‌ సంస్థ బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య సముదాయలకు బల్క్‌, మల్టిపుల్‌ అప్లికేషన్స్‌ రిజిస్ట్రేషన్‌ విధానాన్ని అందుబా టులోకి తీసుకొచ్చింది. గతంలో విద్యుత్‌ కనెక్షన్‌ కావాలంటే సంబంధిత అధికారులు ఎస్టీమేషన్‌ ప్రతిపాదనలు రూపొందించిన దాని ప్రకారం రుసుము చెల్లించే వారు. ఈ విధానాన్ని సవరిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక భవనంలో అవసరమైన అన్నీ విద్యుత్‌ కనెక్షన్లకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఈ విధానంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. బహుళ అంతస్తుల భవనంలో ఎక్కువ విద్యుత్‌ కనెక్షన్లు కావాలనుకుంటే ఇకపై ఒక్క దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది.

- గతంలో సర్వీస్‌ కనెక్షన్‌ కోసం..

గతంలో సర్వీస్‌ కనెక్షన్‌ కోసం ఒక్కొ మీటరుకు ఒకటి చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంతో వినియోదారులకు శ్రమ, సమయం ఆదా కావడంతో పాటు విద్యుత్‌ సిబ్బందికి ఒక్కొ కనెక్షన్‌ కోసం ప్రత్యేకంగా దరఖాస్తుల పరిశీలన, అనుమతులు, కనెక్షన్‌ మంజూరు చేయాల్సిన ప్రయాస తప్పుతుంది. అపార్టుమెంటు, కమర్షియల్‌ కాంప్లెక్సులు, బహుళ భవనాలకు మొత్తం కాంటాకైడ్‌ లోడ్‌ ఆధారంగా చార్జీలు వర్తిస్తాయి. ట్రాన్సఫార్మర్‌ ఏర్పాటు ఖర్చు భారం, వినియోగదారుడిపై మోపరు. నియంత్రిక సరఫరా, ఏర్పాటుకు ఎలాంటి చార్జీలు ఉండవు. శాఖ వారే బాధ్యతలు తీసుకుంటారు. కేటగిరి 1, 2 విభాలకు బహుళ విద్యుత్‌ కనెక్షన్ల విధానం ఎల్‌టీ కేటగిరిలోని గృహ, వాణిజ్య వినియోగదారులకు వర్తిస్తోంది. ఆ భవనం బహుళ అంతస్తుల మొత్తం కాంట్రాక్టు లోడ్‌ ఆధారంగా చార్జిలు నిర్ణయిస్తారు. 20 కిలో వాట్ల వరకు డెవలప్‌మెంటు చార్జీలు, సర్వీస్‌ లైన్‌ చార్జీలు చెల్లించాలి. 20 కిలో వాట్ల కన్న ఎక్కువగా ఉంటే సర్వీసు చార్జీలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

Updated Date - Jul 18 , 2026 | 11:02 PM