Share News

బంగారం మైనింగ్‌లో హట్టి-సింగరేణి జతకట్టాలి

ABN , Publish Date - Aug 29 , 2026 | 04:41 AM

బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

బంగారం మైనింగ్‌లో హట్టి-సింగరేణి జతకట్టాలి

  • సింగరేణి అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం

హైదరాబాద్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): బంగారం మైనింగ్‌లో విశేష అనుభవమున్న కర్ణాటక ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి కలిసి పనిచేసేలా జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. రెండు ప్రభుత్వ రంగ సంస్థల సాంకేతిక సామర్థ్యం, అనుభవాన్ని సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చన్నారు. కర్ణాటక గోల్డ్‌ మైన్స్‌ ప్రాంతంలో రెండో రోజు పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూర్‌ జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను భట్టి సందర్శించారు. ‘యూటీ ఓపెన్‌ కాస్ట్‌ గోల్డ్‌ మైన్‌’వ్యూ పాయింట్‌ వద్ద నిలబడి బంగారం ముడి మట్టిని వెలికి తీసే ప్రక్రియను, ేసకరించిన ప్రదేశాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. హట్టి ప్రాజెక్టు ద్వారా రోజుకు సగటున 2-4 కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతిక వినియోగం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ తదితర అంశాల్లో హట్టి- సింగరేణి సంస్థలు సంయుక్తంగా పనిచేేసందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ పర్యటనలో భట్టి వెంట యసింగరేణి సీఎండీ డాక్టర్‌ బుద్థ ప్రకాష్‌ జ్యోతి, ప్లానింగ్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, జనరల్‌ మేనేజర్‌ పంకజ్‌ కులశ్రేష్ఠ, రాయచూరు జిల్లా పరిషత్‌ సభ్యులు అమ్జద్‌, హట్టి గోల్డ్‌ మైన్స్‌ ఉన్నతాధికారులు ఉన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 04:42 AM