సింగరేణి కార్మికులకు దసరా అడ్వాన్స్ 25 వేలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 06:47 AM
సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ కింద రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేసింది.
గోదావరిఖని, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు దసరా పండుగ అడ్వాన్స్ కింద రూ.25 వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సంస్థ యాజమాన్యం శుక్రవారం సర్క్యూలర్ జారీ చేసింది. ఈ నెల 15న కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఈ డబ్బు జమ చేయనున్నట్టు తెలిపింది. ఉద్యోగాలు పొంది పర్మనెంట్ కానివారికి దసరా అడ్వాన్స్ రూ.12,500 చెల్లించనున్నట్టు వెల్లడించింది. ఈ అడ్వాన్స్ సొమ్మును 10 నెలల్ల్లో తిరిగి కార్మికుల వేతనాల నుంచి రికవరీ చేస్తారు.