Share News

సింగరేణిలో సమ్మెకు సై.. 30 డిమాండ్లతో నోటీసు

ABN , Publish Date - Jun 09 , 2026 | 05:17 AM

సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేకుంటే సమ్మెకు సిద్ధమంటూ గుర్తింపు కార్మిక సంఘం...

సింగరేణిలో సమ్మెకు సై.. 30 డిమాండ్లతో నోటీసు

కొత్తగూడెం టౌన్‌, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికులకు సంబంధించిన ప్రధానమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని.. లేకుంటే సమ్మెకు సిద్ధమంటూ గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధి బృందం సోమవారం సంస్థ ప్రధాన కార్యాలయంలో జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌) కవితా నాయుడుకు నోటీసు అందజేసింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరివి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ.. సింగరేణిలో నూతన గనులను ఏర్పాటు చేయాలని, కార్మికుల సొంతింటి కల నెరవేర్చాలని, మెడికల్‌ బోర్డును నిర్వహించాలని, జెన్‌కో సంస్థ సింగరేణికి బకాయి ఉన్న రూ.56వేల కోట్లను వెంటనే విడుదల చేయించాలని తదితర 30 డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసును అందజేశామన్నారు. యాజమాన్యం వెంటనే స్పందించి పరిష్కరించకపోతే.. వచ్చే జూలైలో సింగరేణిలో సమ్మె కొనసాగిస్తామని ప్రకటించారు.

Updated Date - Jun 09 , 2026 | 05:17 AM