సింగరేణి ఓబీ కుప్ప.. ఇప్పుడు పచ్చటి అడవి
ABN , Publish Date - Jun 11 , 2026 | 05:12 AM
పర్యావరణ పరిరక్షణలో సింగరేణి సంస్థ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి చిత్రంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని...
పర్యావరణ పరిరక్షణలో సింగరేణి సంస్థ దేశంలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. మొదటి చిత్రంలో మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలోని డోర్లీ-2 ఓపెన్‌కా్‌స్ట గని తవ్వకం తర్వాత నిరుపయోగంగా పోసిన ఓబీ(ఓవర్ బర్డెన్) మట్టికుప్పలను చూడవచ్చు. రెండో చిత్రంలో సింగరేణి అదే ప్రాంతాన్ని 162 హెక్టార్లలో దట్టమైన అడవిగా మార్చిన నయన మనోహర దృశ్యం కనిపిస్తుంది. మైనింగ్ తర్వాత సింగరేణి ఇదే ప్రాంతాన్ని చక్కటి హరితహారంగా తీర్చిదిద్ది 100ు పక్కాగా మైన్ క్లోజర్ నిబంధనలు అమలు చేసి పర్యావరణహిత ఘనతను చాటుకుంది. దీనికి గుర్తింపుగా కేంద్ర కోల్ కంట్రోలర్ సంస్థ ప్రారంభంలో దాచిన డిపాజిట్‌ను వడ్డీతో కలిపి రూ.40కోట్లను సింగరేణికి తిరిగి చెల్లించి అభినందించింది.
