Share News

బంగారం, వెండి పూలతో పట్టుచీర

ABN , Publish Date - Apr 12 , 2026 | 12:54 AM

అబ్బురపరిచే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ మరో వినూత్న ప్రయోగంతో బంగారం, వెండి ఉపయోగించి అద్భుతమైన పట్టు చీర నేసాడు. శనివారం

బంగారం, వెండి పూలతో పట్టుచీర
మగ్గంపై బంగారం. వెండి పూల పట్టుచీర

సిరిసిల్ల, ఏప్రిల్‌ 11 (ఆంరఽధజ్యోతి): అబ్బురపరిచే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్‌ మరో వినూత్న ప్రయోగంతో బంగారం, వెండి ఉపయోగించి అద్భుతమైన పట్టు చీర నేసాడు. శనివారం హైదరాబాదులో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షుడు కే తారక రామారావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నల్ల విజయ్‌ని అభినందించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త చెన్నారావు కోరిక మేరకు రెండు గ్రాముల బంగారం, రెండు గ్రాముల వెండి ఉపయోగించి బంగారు, వెండి పూలతో ఎంతో ఆకర్షణీయంగా చేనేత మగ్గంపై చీరను రూపొందించారు. 25 రోజులపాటు శ్రమించి ఐదున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్పుతో తయారైన చీర ఖరీదు రూ. 85 వేల వరకు ఉంటుందని విజయ్‌ తెలిపారు. నల్ల విజయ్‌ నిత్యం చేనేత మగ్గంపై విభిన్నమైన ప్రయోగాలు చేస్తుంటాడు. గతంలో అగ్గిపెట్టలో ఇమిడే చీరలు, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు, కుట్టు లేకుండా వస్త్రాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధిని ప్రజలకు వినూత్నంగా పరిచయం చేస్తూ పట్టు వస్త్రంపై క్యూఆర్‌ కోడ్‌ నేశాడు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా స్కాన్‌ చేస్తే అభివృద్ధి ఫొటోలు చూసే విధంగా యాప్‌ను రూపొందించారు. మూడు కొంగుల చీర, సుగందాలు వెదజల్లే పట్టుచీర, వెండి, బంగారం ఉపయోగించి నేసిన పట్టు చీరలు అందరినీ అకట్టుకుంటున్నాయి.

Updated Date - Apr 12 , 2026 | 12:54 AM