Share News

సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలకు శ్రీకారం

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:29 AM

తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు 2000వ సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పడిన సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టారు.

సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలకు శ్రీకారం

(డాలస్‌ నుంచి కిలారు గోకుల్‌కృష్ణ)

తెలుగు సాహితీ సాంస్కృతిక సంప్రదాయ స్ఫూర్తిని ప్రపంచ వ్యాప్తంగా చాటేందుకు 2000వ సంవత్సరంలో అమెరికాలోని కాలిఫోర్నియాలో ఏర్పడిన సిలికానాంధ్ర సంస్థ రజతోత్సవ వేడుకల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆగస్టు 8వ తేదీ శనివారం నాడు కాలిఫోర్నియాలోని ఓక్‌ల్యాండ్‌ ఎరీనాలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక చైర్మన్‌ కూచిభొట్ల ఆనంద్‌ తెలిపారు. తెలుగు సంప్రదాయాన్ని పాటిస్తూ సిలికానాంధ్ర సభ్యులతో కలిసి ఆయన రజతోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికను శని, ఆదివారాల్లో స్థానిక ప్రవాస తెలుగువారి ఇంటింటికీ వెళ్లి అందజేశారు. అమెరికా వ్యాప్తంగా ప్రవాస తెలుగువారి ఇళ్లకు వెళ్లి ప్రత్యక్షంగా ఆహ్వానించేందుకు సిలికానాంధ్ర కుటుంబసభ్యులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఆనంద్‌ వెల్లడించారు. 15 వేలమంది తెలుగువారు ఈ రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారని అంచనా వేస్తున్నామని పేర్కొన్నారు. ప్రవాస తెలుగు పరిమళాలకు ఈ రజతోత్సవ వేదిక పెద్దపీట వేస్తుందని తెలిపారు.

Updated Date - Feb 05 , 2026 | 04:29 AM