Share News

kumaram bheem asifabad- బాలికకు జరిగిన అన్యాయంపై మౌనం సరికాదు

ABN , Publish Date - May 12 , 2026 | 10:13 PM

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండిసాయి భగీరథ్‌ ఆరాచాకలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడంలేదని, బాలికకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

kumaram bheem asifabad- బాలికకు జరిగిన అన్యాయంపై మౌనం సరికాదు
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోవ లక్ష్మి, పాల్గొన్న బీఆర్‌ఎస్‌ నాయకులు

ఆసిఫాబాద్‌రూరల్‌, మే 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండిసాయి భగీరథ్‌ ఆరాచాకలపై రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెదవి విప్పడంలేదని, బాలికకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్‌ నాయకులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. ఎమ్మెల్యే నివాసంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మైనర్‌ బాలికపై లైంగిక వేధింపులు జరిగితే అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. బాధితురాలికి న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. తమ కుమారుడి ఆరాచాకాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి బండి సంజయ్‌ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం అయనను వెంటనే భర్తరఫ్‌ చేయాలని అన్నారు. రాజకీయ పలుకుబడితో కేసును నీరుగార్చాలని చూస్తే సహించేదిలేదని చెప్పారు. మైనర్‌ బాలికకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ పక్షాన అండగా ఉంటామని తెలిపారు. సమావేశంలో మున్సిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఆకాష్‌, ఆహ్మద్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవ్‌, సర్పంచ్‌ బుర్స పోచయ్య, పార్టీ మండల అధ్యక్షుడు రవిందర్‌, నాయకులు సరస్వతి, లక్ష్మి, ఆహ్మద్‌, ఆశోక్‌, నిసార్‌, ఆన్సార్‌, సమద్‌, జీవన్‌, రవి, శ్రీధర్‌రెడ్డి, గుండా శ్యాం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 12 , 2026 | 10:13 PM