Share News

సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరం లేదు

ABN , Publish Date - Apr 20 , 2026 | 06:01 AM

సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరం లేదని, కేవలం 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తే సరిపోయేదని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు.

సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరం లేదు

  • 500 బెడ్లతో నిర్మిస్తే సరిపోయేది: మంత్రి వివేక్‌

సిద్దిపేట ఏప్రిల్‌ 19 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేటకు వెయ్యి పడకల ఆస్పత్రి అవసరం లేదని, కేవలం 500 పడకల ఆస్పత్రిని నిర్మిస్తే సరిపోయేదని మంత్రి వివేక్‌వెంకటస్వామి అన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నిధులను వృధా చేశారని విమర్శించారు. ఆదివారం సిద్దిపేటలో ఇతర పార్టీల నుంచి పలువురు నాయకులు, కార్యకర్తలు మంత్రి వివేక్‌ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నామని, బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించినట్లు తెలిపారు. కేసీఆర్‌ ప్రభుత్వంలో రూ.8లక్షల కోట్లు అప్పు చేస్తే, కాంగ్రెస్‌ ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ అప్పులకుగాను ప్రతినెలా రూ.5 వేల కోట్ల మేరకు వడ్డీ చెల్లిస్తున్నట్లు చెప్పారు.

Updated Date - Apr 20 , 2026 | 06:02 AM