పాఠశాల హెచ్‌ఎంకు షోకాజ్ నోటీసు
ABN , Publish Date - Jan 07 , 2026 | 11:16 PM
పాఠశాల విధులకు అనధికారికంగా గైర్హాజరవు తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్న జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌కాలనీ ప్రా థమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యా ధికారి రమేష్‌కుమార్ ఆదేశించారు.
నాగర్‌కర్నూల్‌టౌన్, జనవరి7 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విధులకు అనధికారికంగా గైర్హాజరవు తూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్న జిల్లా కేంద్రంలోని సంజయ్‌నగర్‌కాలనీ ప్రా థమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేఖర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేయాలని జిల్లా విద్యా ధికారి రమేష్‌కుమార్ ఆదేశించారు. గతంలో రెండు నెలల క్రితం డీఈఓ సంజయ్ నగర్ కాలనీ ప్రాథమిక పాఠశాలను డీఈవో తనిఖీ చేసిన సమయంలో హెచ్‌ఎం శేఖర్ గైర్హాజరుపై మెమో జారీచేయగా, బుధవారం డీఈవో మరో మారు పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేయగా ఆయన విధులకు అనధికారికంగా గైర్హాజర య్యారని పేర్కొన్నారు. దీంతో హెచ్‌ఎం శేఖర్‌కు నోటీసులు జారీ చేసి రెండు రోజుల్లో వివరణ తీసుకుని, తదుపరి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని నాగర్‌కర్నూల్ ఎంఈవో భార్కర్ రెడ్డిని డీఈఓ ఆదేశించారు. జిల్లాలోని ప్రధానో పాధ్యాయులు, ఉపాధ్యాయులు విధి నిర్వహణ లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు.