kumaram bheem asifabad-వృద్ధులకు ‘చేయూత’నివ్వరా..?
ABN , Publish Date - Nov 25 , 2026 | 10:35 PM
కొత్త పింఛన్ల కోసం వృద్ధులు నిరీక్షిస్తున్నారు. వయో భారంతో ఇబ్బంది పడుతున్నామని, ఫించన్ ఇచ్చి అదుకోండి మహాప్రభో అంటూ నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ప్రభుత్వ కొత్త పింఛన్లు మంజూరు చేసినా వీరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతు న్నారు. జిల్లా వ్యాప్తంగా 2,39,347 మంది వివిధ రకాల పింఛన్దారులు ఉన్నారు
- 2019లో చివరిసారిగా పింఛన్లు మంజూరు
- ఏడేళ్లుగా తప్పని ఎదురుచూపులు
ఆసిఫాబాద్రూరల్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కొత్త పింఛన్ల కోసం వృద్ధులు నిరీక్షిస్తున్నారు. వయో భారంతో ఇబ్బంది పడుతున్నామని, ఫించన్ ఇచ్చి అదుకోండి మహాప్రభో అంటూ నిత్యం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఇటీవల ప్రభుత్వ కొత్త పింఛన్లు మంజూరు చేసినా వీరికి అవకాశం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతు న్నారు. జిల్లా వ్యాప్తంగా 2,39,347 మంది వివిధ రకాల పింఛన్దారులు ఉన్నారు. ఇటీవల కొత్తగా వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, కల్లుగీత కార్మికులకు సంబంధించి నూతనంగా మరో ఎనమిది వేల మందికి పింఛన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. వృద్ధాప్య పింఛన్లు మాత్రం మరిచింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 ఎన్నికల్లో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు ఇస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. నాటి నుంచి ఇప్పటి వరకు ఏళ్లు గడుస్తున్నా కొత్తవారికి మంజూరు చేయడంలేదు. దీంతో ఏటా దరఖాస్తు చేసుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఆరు గ్యాంరెంటీ పథకాల కోసం చేసుకున్న దరఖాస్తుల్లోనూ ఎక్కువగా పింఛన్ కావాలలని ఆప్షన్ ఇచ్చిన వాళ్లే అధికంగా ఉన్నారు. దీంతో పాటు ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిం చే ప్రజావాణి కార్యక్రమంలోనూ పింఛన్ మహాప్రభో అంటూ దరఖాస్తులు చేసుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన పింఛ న్లలో వృద్ధులను పట్టించుకోక పోవడంతో దరఖాస్తు చేసుకున్న వారు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు.
జిల్లాలో ఇలా..
జిల్లాలో అన్ని రకాల పింఛన్లు కలిపి ఇప్పటి వ రకు 56,225 ఉన్నాయి. కాగా ఇటీవల కొత్తగా 8,313 నూతనంగా పింఛన్లు మంజూరయ్యాయి. దీంతో ఈ సంఖ్య 64,538 చేరింది. ఇందులో వృద్ధాప్య పింఛన్లు 24,235 ఉన్నాయి. 2019లో 57 ఏళ్లు నిండిన వారిని అర్హులుగా చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అంతకు ముందు 65 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వృద్ధాప్య పింఛన్లు ఇచ్చేవారు. గడిచిన ఏడేళ్లుగా పాలకులు వృద్ధులను పూర్తిగా విస్మరిస్తున్నారు. అందరిలాగా తమకు సైతం పింఛన్లు ఇచ్చి అదు కోవాలని వేడుకుంటున్నారు. కాగా సాధారణంగా 50 ఏళ్లు నిండిన వారిలో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని వైద్యఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా జిల్లాలో బీపీ, షుగర్ జబ్బులతో ఇబ్బంది పడుతూ మందులు వాడు తున్నారు. అలాంటి వారికి ప్రతి నెలా మందుల కొనుగోలుకు వృద్ధాప్య పింఛన్లు ఇస్తే కొంత ఆసరాగా ఉంటుందని పలువురు చెబుతున్నారు. కుటుంబీకులు ఆదరించకపోవడంతో వయోవృద్ధులు అనారోగ్యాల బారిన పడి నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం వృద్ధులకు పింఛన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
పింఛను మంజూరు చేయాలి..
- చంద్రయ్య, రాజంపేట
ప్రభుత్వం పింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలి. వృద్ధాప్య పింఛను కోసం దరఖాస్తు చేసుకున్న. వృద్ధులకు కొత్త పింఛన్లు ఇవ్వడంలేదని అదికారులు చెబుతున్నారు. అందరికీ మంజూరు చేసి మ మ్ములను విస్మరించడం సబబుకాదు. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని చేయూత పింఛన్ అందజేయాలి.