పారదర్శకంగా నిర్వహించాలి
ABN , Publish Date - Jul 04 , 2026 | 11:28 PM
ఓ టరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కా ర్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ పరిశీలకుడు బి.చె న్నయ్య అన్నారు.
- రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ పరిశీలకుడు బి.చెన్నయ్య
- ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ పరిశీలన
తిమ్మాజిపేట, జూలై 4 (ఆంధ్రజ్యోతి) : ఓ టరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కా ర్యక్రమాన్ని పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయ పరిశీలకుడు బి.చె న్నయ్య అన్నారు. మండల పరిధిలోని మరికల్ గ్రామంలో 3, 4, 5 పోలింగ్ బూత్‌లలో కొనసా గుతున్న ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ కార్యక్ర మాన్ని నాగర్‌కర్నూల్ ఆర్డీవో అర్చన, తహసీ ల్దార్ జయంతితో కలిసి ఆయన పరిశీలించారు. ఓటర్ల నుంచి తీసుకుంటున్న వివరాలు దరఖా స్తుల నమోదు గుర్తింపు పత్రాల పరిశీలన తదితర అంశాలపై బూత్‌లెవల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లనుద్దేశించి మాట్లా డారు. ఫారంలోని ప్రతీ అంశాన్ని జాగ్రత్తగా చ దివి నింపాలని, పేరు లో తప్పుల్లేకుండా చూ సుకోవాలన్నారు. ఫారం స మర్పించిన అనంత రం అంగీకారపత్రం బూత్ లెవల్ అధికారు ల నుంచి పొందాలన్నా రు. ఓటరుకు ఏమైనా సందేహాలు ఉంటే బూ త్ లెవల్ అధికారులను సంప్రదించాలని, మొబై ల్ నెంబరు చిరునామా సక్రమంగా ఉండాలని, త ప్పుడు సమాచారం ఇవ్వొద్దని ఆయన అన్నారు. ఓటరు బూత్ లెవల్ అధికారులకు సరైన సమా చారం అందించడం ద్వారానే ఓటరు జాబితాలో పేరు ఉంటుందని ఆయన అన్నారు. ఒకే వ్యక్తికి సంబంధించి విభిన్న వివరాలు ఇవ్వవద్దని ఫా రం నింపే ముందు పలు జాగ్రత్తలు తీసుకోవా లన్నారు. ఒకే వ్యక్తికి ఒకే చోట ఓటు ఉండేలా చూసుకోవాలని, తప్పు డు సమాచారంతో రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకుంటే చట్టప రమైన చర్యలు తప్పవన్నారు. సీనియర్ అసి స్టెంట్ శ్రీకాంత్, ఆయా పా ర్టీల బూత్ లెవల్ ఏజెంట్లు, గ్రామ పరిపాలన అధికారి ఉన్నారు.