Share News

kumaram bheem asifabad- స్వల్పకాల పంటలు.. దిగుబడి ఎంచక్కా..

ABN , Publish Date - Jul 25 , 2026 | 11:33 PM

వర్షాలు విస్తారంగా కురిస్తేనే సాగు సాఫీగా సాగుతుంది. ఎల్‌నినో ప్రభావంతో ఇంత వరకు సరైన వానలు లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో అత్యధికులు పత్తి ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. వరి పంటకు నీటి తడుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే మేలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు.

kumaram bheem asifabad- స్వల్పకాల పంటలు.. దిగుబడి ఎంచక్కా..
రైతులకు అవగాహన కల్పిస్తున్న ఏవో(ఫైల్‌)

బెజ్జూరు, జూలై 25 (ఆంధ్రజ్యోతి): వర్షాలు విస్తారంగా కురిస్తేనే సాగు సాఫీగా సాగుతుంది. ఎల్‌నినో ప్రభావంతో ఇంత వరకు సరైన వానలు లేక రైతన్నలు దిగాలు చెందుతున్నారు. జిల్లాలో అత్యధికులు పత్తి ఆ తర్వాత వరి సాగు చేస్తుంటారు. వరి పంటకు నీటి తడుల అవసరం ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలే మేలని వ్యవసాయ అధికారులు, నిపుణులు సూచిస్తున్నారు. ఈ మేరకు జిల్లా లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో వర్షాకాలంలో 4.50లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనా వేశారు. కానీ జిల్లాలో ఈ ఏడాది సరైన వర్షాలు లేక పత్తి మినహ ఏ పంటలు సాగు చేయలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో వరిక బదులు తక్కువ నీటితో పండే పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

ఫ తక్కువ నీటితో పండే పంటలు ఇలా..

జొన్న: తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతా ల్లో సాగు చేసుకోవచ్చు. జూలై వరకు విత్తు కోవచ్చు. ఎకరానికి 3-4కిలోల విత్తనాలు సరిపోతాయి. 80-100రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఎకరానికి 20క్వింటాళ్ల వరకు దిగు బడి వస్తుంది. జిల్లాలో జొన్న సాగు చేయ డానికి అనుకూలమైన భూములు ఉన్నాయి. రైతులు జొన్న పంటను సాగు చేసి ఆర్థికంగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది.

సజ్జ: దీన్ని జూలై చివరి వరకు నాటుకోవ చ్చు. ఎకరానికి 2కిలోల విత్తనం అవసరం. పంట కాలం 85రోజులు. ఎకరానికి 12క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది.

రాగులు: ఆగస్టు నెలలోపు విత్తుకునే అవ కాశం ఉంటుంది. ఎకరానికి 1.2కిలోల విత్త నం సరిపోతుంది. పంట కాలం 105-110 రోజులు. ఎకరానికి 10క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.

కంది: జూలై చివరి వరకు విత్తుకోవచ్చు. అడపాదడపా వానలు కురిసినా పండు తుంది. ఎకరానికి 3కిలోల విత్తనం అవసరం. లేట్‌ ఖరీఫ్‌లో మధ్యకాలిక రకాలు అను కూలం. పంటకాలం 150నుంచి 170రోజులు. ఎకరానికి 8క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. జిల్లాలో కంది పంటకు చాలాచోట్ల అనుకూ లమైన భూములు ఉన్నాయి.

పెసర: ఈ నెలలోనే విత్తనాలు వేసుకోవ చ్చు. ఎకరానికి 6కిలోల విత్తనాలు సరిపోతాయి. పంటకాలం 70రోజుల వరకు ఉండ గా, దిగుబడి 6క్వింటాళ్ల వరకు వస్తుంది.

మినుము: మినుము జూలై వరకు విత్తుకోవచ్చు. విత్తనం మోతాదు ఎకరాకు 6కిలోలు అవసరం. పంటకాలం 72రోజులు. దిగుబడి 6క్వింటాళ్ల వరకు వస్తుంది.

పొద్దుతిరుగుడు: ఆగస్టు రెండో వారం వరకు వేసుకోవచ్చు. నీటి తడులు తక్కువ అవసరం ఉంటాయి. ఎకరానికి 3-4కిలోల విత్తనం సరిపోతుంది. పంటకాల 90రోజులు. ఎకరానికి 4నుంచి 6క్వింటాళ్ల వరకు దిగుబడి ఉంటుంది.

నువ్వులు: ఈనెల ఆఖరి వారం నుంచి ఆగస్టు మొదటి వారం వరకు విత్తనాలు వేసుకోవచ్చు. ఎకరానికి 2-4కిలోల విత్తనాలు అవసరం ఉంటాయి. పంటకాలం 90 రోజు లు. మూడు క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.

ఆరుతడి పంటలు వసుకోవాలి..

- నాగరాజు, ఏవో, బెజ్జూరు

ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో వరి పంటను కాకుండా రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలి. జిల్లాలోని భూములు అరుతడి పంటలు సాగు చేయడానికి అనుకూలంగా ఉన్నాయి. తక్కువ నీటి లభ్యత ఉన్నా పంట లను సాగు చేసుకోవచ్చు. తక్కువ పెట్టుబ డితో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఇప్పటికే ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రభుత్వం కూడా ఎక్కువగా ఆరుతడి వైపు మొగ్గుచూపుతోంది. రైతులు దృష్టి సారించాలి.

Updated Date - Jul 25 , 2026 | 11:33 PM