Share News

సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదు

ABN , Publish Date - May 06 , 2026 | 06:58 AM

రాష్ట్ర భద్రత సలహాదారు (స్టేట్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌-ఎస్ఎస్ఏ)గా మాజీ డీజీపీ బి. శివధర్‌రెడ్డి నియామకం చెల్లదని పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో దరఖాస్తు దాఖలయింది.

సలహాదారుగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదు

  • హైకోర్టులో దరఖాస్తు దాఖలు

హైదరాబాద్‌, మే 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర భద్రత సలహాదారు (స్టేట్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌-ఎస్ఎస్ఏ)గా మాజీ డీజీపీ బి. శివధర్‌రెడ్డి నియామకం చెల్లదని పేర్కొంటూ మంగళవారం హైకోర్టులో దరఖాస్తు దాఖలయింది. ఆయనను ఎస్ఎస్ఏగా నియమిస్తూ జారీచేసిన జీవో 559పై స్టే విధించాలని పిటిషనర్‌ కోరారు. తాత్కాలిక డీజీపీగా శివధర్‌రెడ్డి నియామకం చెల్లదంటూ గతంలో పిటిషన్‌ వే సిన టి. ధన్‌గోపాల్‌రావే ఈ దరఖాస్తును సమర్పించారు. ఆ పిటిషన్‌ ఇప్పటికీ పెండింగ్‌లో ఉన్నందున దానికి అనుబంధంగా ఈ అప్లికేషన్‌ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు నిర్దేశించిన విధానానికి విరుద్ధంగా శివధర్‌రెడ్డిని తాత్కాలిక డీజీపీగా నియమించారని, యూపీఎస్సీ నుంచి అర్హులైన అధికారుల జాబితా కోరలేదని ప్రధానంగా ఆ పిటిషన్‌లో ఆరోపించారు. తాను దాఖలు చేసిన పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగానే శివధర్‌ రెడ్డిని మళ్లీ ప్రభుత్వ సలహాదారుగా.. అదీ చీఫ్‌ సెక్రటరీ ర్యాంకులో నియమించడం చెల్లదని పిటిషనర్‌ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ త్వరలో విచారణకు రానుంది.

Updated Date - May 06 , 2026 | 07:00 AM