నేడు కొత్త గవర్నర్ ప్రమాణం
ABN , Publish Date - Mar 11 , 2026 | 04:22 AM
తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి...
శివ్ ప్రతాప్ శుక్లాకు స్వాగతం పలికిన ముఖ్యమంత్రి
హైదరాబాద్, శంషాబాద్ రూరల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ్ ప్రతాప్ శుక్లా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్‌భవన్‌లో ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణం చేయిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా మంగళవారం ఉదయం 11.30కు ఢిల్లీ నుంచి వచ్చిన శివ్ ప్రతాప్ శుక్లాకు శంషాబాద్ విమానాశ్రయంలో సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ శివధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. విమానాశ్రయంలోని వీవీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు శివ్ ప్రతాప్ శుక్లా, సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.