అమెరికా, ఇజ్రాయెల్‌ను అల్లా అంతం చేస్తాడు
ABN , Publish Date - Mar 02 , 2026 | 01:24 AM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనిని హతమార్చడం పిరికిపందల చర్య అని షియా ముస్లిం పెద్దలు విమర్శించారు. ఖమేని మృతికి నిరసనగా ఆదివారం...
ఖమేని హత్యకు నిరనగా షియా ముస్లింల నిరసన ర్యాలీ
చార్మినార్/రాయదుర్గం, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనిని హతమార్చడం పిరికిపందల చర్య అని షియా ముస్లిం పెద్దలు విమర్శించారు. ఖమేని మృతికి నిరసనగా ఆదివారం హైదారాబాద్‌లోని పురాని హవేలి చౌరస్తా నుంచి దారుల్ షిఫా వరకు షియా ముస్లింలు నల్లని వస్త్రాలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అమెరికా, ఇజ్రాయిల్ జాతీయ పతాకాలను రోడ్డుఫై పరచి కాళ్లతో, వాహనాలతో తొక్కుతూ వెళ్లారు. ‘‘పాలస్తీనకు మద్దతుగా నిచిచినందుకే ఇరాన్‌పై కక్ష కట్టారు. అణ్వాయుధాలంటూ కుంటి సాకు చూపించి, అమాయకులను హతమార్చారు. అమెరికా, ఇజ్రాయెల్ దౌర్జన్యాన్ని అల్లా గమనిస్తున్నాడు. ఆ రెండు దేశాలను త్వరలోనే నాశనం చేస్తాడు’’ అని షియా ముస్లిం పెద్దలు పేర్కొన్నారు. ముస్లిం మహిళలు సైతం ఇరాన్ ప్రజలను కాపాడాలని కన్నీళ్లతో ప్రార్థించారు. మరోవైపు, ర్యాలీ నేపథ్యంలో నానక్ రాంగూడ ఐటీ జోన్‌లోని యూఎస్ కాన్సులేట్ వద్ద ఆదివారం ఉదయం నుంచే భారీ భద్రతను ఏర్పాటు చేశారు.