కల్వకుర్తిలో గొర్రెలు, మేకల సంత ప్రారంభం
ABN , Publish Date - Apr 29 , 2026 | 11:52 PM
కల్వకుర్తి పట్టణంలో గొర్రెలు, మేకల సంత అందుబాటులోకి వ చ్చింది. పట్టణంలోని వ్యవ సాయ మార్కెట్ ఆవరణ లో గొర్రెల, మేకల సంత ను బుధవారం ముని సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్న మాల, మార్కెట్ చైర్‌పర్సన్ ఉ మా మనీలా ప్రారంభించారు.
కల్వకుర్తి, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : కల్వకుర్తి పట్టణంలో గొర్రెలు, మేకల సంత అందుబాటులోకి వ చ్చింది. పట్టణంలోని వ్యవ సాయ మార్కెట్ ఆవరణ లో గొర్రెల, మేకల సంత ను బుధవారం ముని సిపల్ చైర్‌పర్సన్ బృంగి రత్న మాల, మార్కెట్ చైర్‌పర్సన్ ఉ మా మనీలా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణ రెడ్డి సహకారంతో కల్వకుర్తిలో గొర్రెలు, మేకల సంతను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. యాదవ సోదరులు త మ గొర్రెలు, మేకలు విక్రయించుకోవడానికి ఈ సంత దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సంజీవ్ కుమార్ యాదవ్, పీసీబీ సభ్యులు ఠాకూర్ బాలాజీసింగ్, మునిసిపల్ కమిషనర్ మహమ్మ ద్‌షేక్, వైస్ చైర్మన్ షానవా జ్‌ఖాన్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చి మ్ముల శ్రీకాంత్‌రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పసుల రమాకాం త్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.