బి ఆర్ టి యు కృషి తో షీలా ఫోం కార్మికులకు జీతాల పెంపు : సంబు ప్రభాకర్
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:22 AM
బి ఆర్ టి యు కృషి వల్ల కార్మికులకు వేతనాలు పెంపు హర్షించదగ్గ విషయమని బీ ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, షీలా ఫోం కంపెనీ అధ్యక్షులు సంబు ప్రభాకర్ తెవలిపారు.
మేడ్చల్ జిల్లా, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): బి ఆర్ టి యు కృషి వల్ల కార్మికులకు వేతనాలు పెంపు హర్షించదగ్గ విషయమని బీ ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, షీలా ఫోం కంపెనీ అధ్యక్షులు సంబు ప్రభాకర్ తెవలిపారు. బి ఆర్ టి యు యూనియన్ సలాహాదారులు నారాయణ, బీ ఆర్ టి యు మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, షీలా ఫోం కంపెనీ అధ్యక్షులు సంబు ప్రభాకర్ లో ఆధ్వర్యంలో షీలా ఫోం కంపెనీ కార్మికులకు వేతనాల పెంపుపై కార్మికులు హర్షించారు. కంపెనీలో పనిచేసే వారికి జూనియర్ కార్మికులకు 11వేలు, సీనియర్ కార్మికులకు 13వేల 500 జీతాలు పెంచడం జరిగింది. దీనిపై యూనియన్ కార్మికులు, బి ఆర్ టి యు నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కార్మికులక ఐఖ్యతతో, యాజమాన్యం సహకారంతోనే వేతనాల పెంపు ఒప్పందం చేశామని నాయారణ, సంబు ప్రభాకర్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో షీలా ఫోం ఎంప్లాయిస్ యూనియన్ జనరల్ సెక్రటరీ సయ్యద్ సిరాజుద్దీన్, సభ్యులు శ్రీనాధ్, చిల్ల నవీన్ కుమార్, బీము నాయుడు, నరేష్, స్మరణ కుమార్, జయ జ్యోతి, లంక, జీరు ఎర్రయ్య, ఎన్.ప్రభాకర్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.