మహిళలకు అండగా షీ టీం సేవలు
ABN , Publish Date - Aug 19 , 2026 | 11:25 PM
సమా జంలో మహిళలు చిన్నారు లు వృద్ధులపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎ దుర్కొనేందుకు వారికి అండ గా షీటీం ఉంటుందని డీ ఎస్పీ పల్లె శ్రీనివాస్ అన్నా రు.
- డీఎస్పీ పల్లె శ్రీనివాస్
అచ్చంపేటటౌన్, ఆగస్టు 19 (ఆంధ్రజోతి) : సమా జంలో మహిళలు చిన్నారు లు వృద్ధులపై జరుగుతున్న అన్యాయాలను ధైర్యంగా ఎ దుర్కొనేందుకు వారికి అండ గా షీటీం ఉంటుందని డీ ఎస్పీ పల్లె శ్రీనివాస్ అన్నా రు. బుధవారం మండల పరి ధిలోని ఐనోల్ గిరిజన బాలిక ల గురుకుల ఆశ్రమ పాఠశా లలో జిల్లా షీటీం ఆధ్వర్యంలో విద్యార్థినులకు జిల్లా కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ మహిళల ను ఇంటి పక్కల వ్యక్తులు కానీ రోడ్డుపై వెళ్తున్న ఎవరినైనా పోకి రీలు వేఽధిస్తే వెంటనే 112 నెంబర్‌కు కాల్‌చేస్తే షీటీం వారికి అండగా ఉంటుందన్నారు. బాలికలు చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సోష ల్ మీడియాలో వచ్చే అపరిచిత లింకులను ఓ పెన్ చేయవద్దన్నారు. కార్యక్రమంలో సీసీఎస్ సీఐ శంకర్, షీటీం జిల్లా ఇన్‌చార్జి విజయలక్ష్మి, అచ్చంపేట సీఐ నాగరాజు, సిద్దాపూర్ ఎస్‌ఐ అంజయ్య, షీటీం బృందం సభ్యులు వెంకట య్య, మల్లేష్, వెంకట్, జానకిరాములు, తదితరులు పాల్గొన్నారు.