Share News

kumaram bheem asifabad-‘ఆమె’దే జోరు

ABN , Publish Date - Feb 08 , 2026 | 11:40 PM

పురు పోరులో ‘ఆమె’దే జోరు కనిపిస్తోంది. మహి ళలు రాజకీయల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. వంటింటికే పరిమితం కాకుండా ము న్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్‌ కేటాయించిన వార్డులతో పాటు జనరల్‌ వార్డుల ల్లోను బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

kumaram bheem asifabad-‘ఆమె’దే జోరు
లోగో

- ఓటరు జాబితాలోను వారిదే ఆధిక్యం

- రెండు మన్సిపాలిటీల్లోను వారికే ఎక్కువ ఓట్లు

- కాగజ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకే

ఆసిఫాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): పురు పోరులో ‘ఆమె’దే జోరు కనిపిస్తోంది. మహి ళలు రాజకీయల్లోనూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్నారు. వంటింటికే పరిమితం కాకుండా ము న్సిపల్‌ ఎన్నికల్లో రాజకీయ చక్రం తిప్పుతున్నారు. జిల్లాలో రెండు మున్సిపాలిటీలలో మహిళలకు రిజర్వేషన్‌ కేటాయించిన వార్డులతో పాటు జనరల్‌ వార్డుల ల్లోను బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. జిల్లాలో మొత్తంగా పురుష అభ్యర్థుల కంటే ఎక్కువగా ఎన్నికల బరిలో ఉన్నారు. స్థానిక సంస్థల్లో ప్రతీ మున్సిపాలిటీలో సగం స్థానాలు మహిళలకు రిజర్వ్‌ చేయగా ఇంకా బీసీ, ఎస్సీ, ఎస్టీ, జనరల్‌ స్థానాల్లోను పోటీలో నిలిచారు. దీంతో అతివల సంఖ్య పెరిగింది. కుటుంబంలో రాజకీయల్లో ఉన్న భర్తల ప్రోత్సాహంతో కొందరు రిజర్వేషన్లు కలిసి రావడంతో మరికొందరు పోటీ చేశారు. కొన్ని చోట్ల తల్లులు, భార్యలు, కూతుళ్లు, ఇతర కుటుంబ సభ్యులను బరిలో నిలిపారు. కుటుంబ సభ్యులు వారి వెంట ఉంటూ ప్రచారంలో పాల్గొంటున్నారు. జిల్లాలో కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహిళకు కేటాయించగా ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ చైర్మన్‌ పదవిని బీసీ జనరల్‌ కు కేటాయించారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డులలో మొత్తం 94 మంది అభ్య ర్థులు బరిలో నిలువగా అందులో 49 మంది మహి ళలు పోటీ చేస్తున్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 30 వార్డుల్లో 130 మంది బరిలో నిలువగా అందులో 86 మంది మహిల అభ్యర్థులే బరిలో ఉండి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. రెండు మున్సిపాలిటీలలో మొత్తం 224 మంది బరిలో నిలువగా అందులో 135 మంది మహిళామణులే బరిలో నిలిచారు. దీంతో 59 శాతం మంది మహిళలు ఎన్నికల బరిలో నిలిచి పురుషుల కంటే అధిక్యతలో తమ సత్తా చాటనున్నారు. వీరిలో చాలమంది ఉన్నత విద్యవంతులు ఉండగా మరి కొంతమంది గృహిణులు, వ్యాపారులు రాజకీయా లంటే తెలియని వారు ఉన్నారు. వయసు పరంగా చూస్తే కనిష్ఠంగా 21 ఏళ్లు గరిష్ఠంగా 55 ఏళ్ల వారు బరిలో తలపడుతున్నారు. మరోవైపు రెండు మున్సిపాలిటీల్లోను పురుష ఓటర్ల కంటే మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. దీంతో గెలుపు ఓటము లపైన మహిళలే ప్రభావం చూపనున్నారు.

- రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం

రిజర్వేషన్లు 2011 జనాభా లెక్కల ప్రకారం కేటా యించారు. జిల్లాలో రెండు మున్నిపా లిటీల పరిధి లో 50 వార్డులు ఉన్నాయి. ఆసిఫాబాద్‌లో 20 వార్డు లు, కాగజ్‌ నగర్‌లో 30 వార్డులు ఉన్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు కేటాయించారు. ఎస్టీ సామాజిక వర్గానికి 3, ఎస్సీకి 8 , బీసిలకు 14, జనరల్‌ మహిళలకు 15, జనరల్‌ స్థానాలకు 10 వార్డలను కేటాయించారు.ఇందులో మహిళలకు మొత్తం 25 వార్డులకు రిజర్వేషన్లను ఖరారు చేశారు.అసిఫాబాద్‌ మున్సిపాలిటీలో మొ త్తం 20 వార్డులు ఉండగా ఇందులో 5,7,8,12,13,14,16,18, 19,20 వార్డులను మహిళలకే కేటాయించారు. కాగ జ్‌నగర్‌లో మొత్తం 30 వార్డులు ఉండగా అందులో 1,3,4,6,7,9,12,13,14, 18,19,20, 21, 23,27 వార్డులను మహిళలకు కేటాయించారు. ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ చైర్మెన్‌ పదవి బీసీ జనరల్‌కు కేటాయించారు. కాగ జ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవి బీసీ మహి ళకు కేటాయించారు.

- మహిళా ఓటర్లే కీలకం..

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లే కీలకంగా మారనున్నారు. ఆసిఫాబా ద్‌ మున్సిపాలిటీలో మొత్తం 13,927 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,103 మంది మహిళలు, 6,822 మంది పురుష ఓటర్లు ఉండగా ఇందులో 281 మం ది మహిళా ఓటర్లు అధిక్యంలో ఉన్నారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 26,193 మంది మహి ళలు, 25,004 మంది పురుషులు ఉండగా 1184 మంది మహిళ ఓటర్లు అధిక్యంలో ఉన్నారు. రెండు మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 1,465 మంది మహిళా ఓట ర్లు పురుష ఓటర్ల కంటే అధిక్యతలో ఉన్నారు. అటు ఎన్నికల బరిలోనూ ఇటు ఓటర్ల జాబితాలోనూ మహిళలు అధిక్యతలో ఉండడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో మహిళలే కీలకంగా మారారు.

Updated Date - Feb 08 , 2026 | 11:40 PM