Share News

ఆమెదే ఆధిపత్యం..

ABN , Publish Date - Jan 13 , 2026 | 11:31 PM

రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలక భూమిక పోషించనున్నారు. ఇటీవల ప్రక టించిన మునిసిపాలిటీల ఓటర్ల జాబితాలో పురుషుల కంటే మహిళలు దాదాపు మూడు వేల వరకు అధికం గా ఉన్నారు.

ఆమెదే ఆధిపత్యం..

మహిళా ఓటర్లే అధికం...

-మునిసిపల్‌ ఎన్నికల్లో వారిదే పైచేయి

-గెలుపోటములు నిర్ణయించనున్న అతివలు

-జిల్లాలో 2.94 లక్షల మంది ఓటర్లు

-పురుషుల కంటే మూడు వేలు అధికంగా స్ర్తీలు

మంచిర్యాల, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రాబోయే మునిసిపల్‌ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లే కీలక భూమిక పోషించనున్నారు. ఇటీవల ప్రక టించిన మునిసిపాలిటీల ఓటర్ల జాబితాలో పురుషుల కంటే మహిళలు దాదాపు మూడు వేల వరకు అధికం గా ఉన్నారు. జిల్లాలోని మంచిర్యాల మునిసిపల్‌ కార్పొ రేషన్‌తోపాటు మిగతా మునిసిపాలిటీల్లో మహిళా ఓ టర్లే అధికంగా ఉండటం గమనార్హం. అధికార కాం గ్రెస్‌ ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలతో మహిళ లకు పెద్దపీట వేస్తుండగా, బీజేపీ, బీఆర్‌ఎస్‌ నాయ కులు సైతం వారిని ఆకర్శించే ప్రయత్నాలు చేస్తున్నా రు. ఇందులో భాగంగా సంక్రాంతి నేపథ్యంలో సాం ప్రదాయ ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలను ఆకర్శించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం ఎన్నికలు జరుగనున్న మంచిర్యాల కార్పొరేషన్‌తోపాటు ఐదు మునిసిపాలిటీల పరిధిలో మొత్తం 149 వార్డులు ఉన్నాయి. మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి తుది ముసాయిదా ఓటరు జాబితాను ఈ నెల 12 ప్రదర్శిం చగా మొత్తం ఐదు మునిసిపాలిటీల్లో మొత్తం 2,94, 399 ఓటర్లు ఉన్నారు. వీరిలో స్త్రీలు 1,48,914 మంది ఉండగా, పురుషులు 1,45,458 మంది, ఇతరులు 27 మంది ఓటర్లు ఉన్నారు.

50 శాతం సీట్లు మహిళలకే...

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రకారం మ హిళలకు 50 శాతం సీట్లు కేటాయిస్తారు. ఇవే గాకుం డా మిగతా 50 శాతం సీట్లలో జనరల్‌ కేటగరీకి కేటా యించే స్థానాల్లో మహిళలు పోటీ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో జనర ల్‌ స్థానాల్లో పోటీచేసి, గెలిచిన మహిళల సంఖ్య అధి కంగానే ఉంది. వచ్చే ఎన్నికల్లో కూడా మహిళా ఓటర్ల ను ఆకర్శించేందుకు జనరల్‌ స్థానాల్లో కూడా కొందరు మహిళలను రంగంలోకి దింపాలని ఆయా పార్టీల ముఖ్య నేతలు భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ మ హిళా ఓటర్లే అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయిస్తు న్నారు. దీంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు మహిళలకు ప్రాధాన్యం ఇచ్చే విధంగా తమ కార్యాచ రణ చేపడుతున్నారు. ప్రభుత్వం కూడా మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం యూనిట్లు మంజూరు చేస్తూ రుణాలు అందజేస్తోంది. ఆర్టీసీ అద్దె బస్సుల్లో మహిళలను పాత్రదారులను చేయడం, పెట్రోల్‌ బం కుల ఏర్పాటు, తదితర పథకాలు ప్రత్యేకంగా రూపొం దించి అమలు చేస్తోంది. అలాగే ఆర్టీసీ బస్సుల్లో మ హిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించ డం, ఇందిరమ్మ ఇళ్లు మహిళల పేరిట మంజూరు చే యడం ద్వారా వారికి పెద్దపీట వేస్తోంది. అధికార పా ర్టీతోపాటు ప్రతి పక్ష పార్టీల నాయకులు సైతం మహి ళల ఓట్లపై ఎక్కువగా ధృష్టి సారిస్తున్నారు.

మునిసిపాలిటీల వారీగా ఓటర్లు...

బల్దియా వార్డులు మొత్తం పురుషులు స్త్రీలు ఇతరులు

మంచిర్యాల 60 1,81,778 90,646 91,111 21

బెల్లంపల్లి 34 44,575 21,560 23,012 03

క్యాతన్‌పల్లి 22 29,785 14,761 15,023 01

చెన్నూరు 18 19,903 9711 10,191 01

లక్షెట్టిపేట 15 18,358 8780 9577 01

............. ............ ........... .............. ......

మొత్తం 149 2,94,399 1,45,458 1,48,914 27

.............. ............. ........... .............. ......

రిజర్వేషన్లపైనే అందరి దృష్టి....

మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి వార్డుల వా రీగా రిజర్వేషన్‌లు త్వరలో ప్రకటించనున్నందున అందరి దృష్టి ప్రస్తుతం వాటిపైనే కేంద్రీకృతమై ఉంది. వార్డుల విభజన, ఓటర్లు జాబితా ప్రక్రియ ముగియ డంతో అధికారులు ఇక రిజర్వేషన్లపై దృష్టి సారించను న్నారు. దీంతో ఆశావహులు తమ అంచనాల్లో నిమగ్న మై ఉన్నారు. రిజర్వేషన్లు అనుకూలించిన పక్షంలో కా ర్పొరేటర్‌గా బరిలో దిగేందుకు అనేక మంది వివిధ పార్టీల నుంచి టికెట్‌ ఆశించే వారితోపాటు యువత మొగ్గు కనబపరుస్తున్నారు. ఈ నెల 16న రిజర్వేషన్లు వెలవరిస్తారనే ప్రచారం జరుగుతుండటంతో ఆశావ హులు తీవ్ర ఉత్కంఠకు లోనవుతున్నారు. తమ వార్డు లో రిజర్వేషన్‌ అనుకూలించని పక్షంలో సమీప వార్డు నుంచైనా బరిలో దిగాలనే పట్టుదలతో ఉన్నారు. ము ఖ్యంగా మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మంచిర్యాల కార్పొరేష న్‌కు తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నందున బరిలో దిగాలనే బలమైన ఆకాంక్షతో ఉన్నారు. జనరల్‌ స్థాన మైతే తమ కుటుంబంలోని మహిళలను రంగంలోకి దింపే యోచనలో అనేక మంది ఉన్నారు. మొత్తం రి జర్వేషన్ల అంకం అటు వివిధ పార్టీల ముఖ్య నేతలతో పాటు ఆశావహుల్లోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

Updated Date - Jan 13 , 2026 | 11:31 PM