Share News

kumaram bheem asifabad- విద్యార్థుల ఆలోచనలకు పదును

ABN , Publish Date - Nov 01 , 2026 | 10:54 PM

పోటీ ప్రపం చంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కా రాలు చూసే ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. చిన్న వయసు లోనే సృజనాత్మక ఆలోచనలకు పదను పెట్టి నమూనాల రూపంలో అవిష్కరించేలా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ), విద్యాశాఖ సంయుక్తంగా ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే నూతన అవిష్కరణలపై ఆసక్తి పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం

kumaram bheem asifabad- విద్యార్థుల ఆలోచనలకు పదును
లోగో

వాంకిడి, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోటీ ప్రపం చంలో విద్యార్థులు కేవలం పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కా రాలు చూసే ఆవిష్కర్తలుగా ఎదిగేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. చిన్న వయసు లోనే సృజనాత్మక ఆలోచనలకు పదను పెట్టి నమూనాల రూపంలో అవిష్కరించేలా తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్‌ సెల్‌ (టీఎస్‌ఐసీ), విద్యాశాఖ సంయుక్తంగా ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. పాఠశాల స్థాయి నుంచే నూతన అవిష్కరణలపై ఆసక్తి పెంపొందించడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా తెలంగాణ ఫ్యూచర్‌ ఇన్నోవేటర్స్‌ ఛాలెంజ్‌ (టీఎస్‌ఐసీ, 1.0)లో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు, కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, గురుకులాల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు పాల్గొన వచ్చు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే సమస్యను గుర్తించి దానికి వినూత్న పరిస్కారాన్ని సూచించే నమూనాను రూపొందించాలి. సమస్య ను గుర్తించడం నుంచి పరిష్కారాన్ని ఆచరణలో చూపించడం వరకు విద్యార్థుల ఆలోచనా సామర్థ్యానికి ఈ కార్యక్రమం పరీక్షగా నిలువనుంది.

- బృందాలుగానూ..

విద్యార్థులు వ్యక్తిగతంగా.. లేదంటే ముగ్గురు సభ్యుల బృందంగా ప్రాజెక్టులను రూపొందిం చుకోవచ్చు. తెలంగాణ.డీవోడీఈఎంఐటీఆర్‌ఏ.ఓఆర్‌జీ వెబ్‌సైట్‌లో నవంబరు 6 వరకు వివరాలు నమోదు చేసుకునే అవ కాశం ఉంది. విద్యార్థి గుర్తింపు సంఖ్య పెన్‌ ఆధా రంగా లాగిన్‌ అయి సమస్య, దానికి సూచించే పరిష్కారం వివరాలను సమర్పించాలి. ప్రాజెక్టు నమూనా చిత్రం, చిన్న వీడియోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. కాగా రాష్ట్ర కమిటీ ప్రతిపాదనలను పరిశీలించి ప్రతి జిల్లా నుంచి 30 ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేస్తుంది. వాటిని జిల్లా స్థాయి ప్రదర్శనలో ప్రదర్శించాల్సి ఉంటుం ది. ఇందులో అత్యు త్తమంగా నిలిచిన మూడు నమూ నాలకు అవార్డులు అందిస్తారు. ప్రథమ, ద్వితీయ స్థానా ల్లో నిలిచిన ప్రాజెక్టుల విద్యార్థులకు నిపుణులను మర్గాద ర్శకులు (మెంటార్లు) నియమిస్తారు. వారి సహకారం తో ప్రాజెక్టులను మరింత అభివృద్ధి చేసి హైదరాబాద్‌లో రాష్ట్ర స్థాయిలో ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. అక్కడ ఉత్తమంగా నిలిచే ఆవిష్కరణలకు అవార్డులు అందిస్తారు.

Updated Date - Nov 01 , 2026 | 10:54 PM