నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌కు ఫెమినా అచీవర్స్ పురస్కారం
ABN , Publish Date - Feb 01 , 2026 | 07:22 AM
ఫెమినా అచీవర్స్ అవార్డు-2026ను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు అందుకున్నారు.
హైదరాబాద్, జనవరి 31(ఆంధ్ర జ్యోతి): ఫెమినా అచీవర్స్ అవార్డు-2026ను నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్ శరణి పొంగూరు అందుకున్నారు. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాల పెంపునకు ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని నారాయణ గ్రూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఫెమీనా అచీవర్స్ అవార్డ్స్2026- నార్త్ వేదికగా ఎక్స్‌లెన్స్ ఇన్ స్టూడెంట్ మైండ్ సెట్ , లీడర్ షిప్ డెవల్‌పమెంట్ అవార్డుతో సత్కరించారని పేర్కొంది. విద్యార్థుల్లో ప్రతికూల ఆలోచనలను తొలగించి.. ఆత్మస్థైర్యాన్ని నింపారని, మానసిక పరివర్తన కోసం శరణి చేసిన నిర్విరామ కృషికి ఈ అవార్డు దక్కిందని తెలిపింది. తనకు ఈ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని శరణి పేర్కొన్నారు.