Share News

kumaram bheem asifabad-భక్తజన సంద్రమైన శంకర్‌లొద్ది క్షేత్రం

ABN , Publish Date - Mar 19 , 2026 | 11:09 PM

మండలంలోని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఉన్న శంకర్‌లొద్ది ప్రాంతం ఉగాది పర్వదినంన భక్త జన సంద్రంగా మారింది. తెలంగాణ, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో సేవాలాల్‌ భక్తులు తరలి వచ్చి గృహంలోని శివలింగంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హారజరైన మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ బంజారాల హక్కుల సాధన కోసం దేశంలో ఉన్న 10 కోట్ల బంజారాలు ఐక్యంగా ఉంది తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడిపహాడ్‌ పండుగ (ఉగాది) రోజున పవిత్ర పుణ్యక్షేత్రమైన శంకర్‌లొద్దిని దర్శించుకోవడం పూర్వజన్మ పుణ్యమన్నారు.

kumaram bheem asifabad-భక్తజన సంద్రమైన శంకర్‌లొద్ది క్షేత్రం
శంకర్‌లొద్దిలో భక్తుల సందడి

కెరమెరి, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దున ఉన్న శంకర్‌లొద్ది ప్రాంతం ఉగాది పర్వదినంన భక్త జన సంద్రంగా మారింది. తెలంగాణ, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో సేవాలాల్‌ భక్తులు తరలి వచ్చి గృహంలోని శివలింగంను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి హారజరైన మహారాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సంజయ్‌ రాథోడ్‌ మాట్లాడుతూ బంజారాల హక్కుల సాధన కోసం దేశంలో ఉన్న 10 కోట్ల బంజారాలు ఐక్యంగా ఉంది తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుడిపహాడ్‌ పండుగ (ఉగాది) రోజున పవిత్ర పుణ్యక్షేత్రమైన శంకర్‌లొద్దిని దర్శించుకోవడం పూర్వజన్మ పుణ్యమన్నారు. శంకర్‌లొద్దిలో అన్ని ఏర్పాట్లకు మహారాష్ట్ర నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. శంకర్‌లొద్దిలో బంజారాల ఆధ్యాత్మిక గురువులు ప్రేంసింగ్‌ మహారాజ్‌, రాంసింగ్‌ మహారాజ్‌లు తపస్సు చేసిన పుణ్యభూమి అని ఈ ప్రాంతాన్ని లంబాడాలు ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తారన్నారు. అలాగే పౌరాదేవి క్షేత్రాన్ని సైతం బంజారాల కాశీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజారా ఎమ్మెల్యే దేవ్‌రావు దాదా మాట్లాడుతూ తన నియోజక వర్గంలోని శంకర్‌లొద్ది క్షేత్రంలో భక్తుల ఇబ్బందులు తొలగించేందుకు తన నిధుల నుంచి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. అలాగే ఈ ప్రాంత రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృణి చేస్తానని అన్నారు. ఈ ప్రాంతంలో సాగునీటి వసతి కల్పించేందుకు లిఫ్టు ఇరిగేషన్‌లు ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ పరంగా అభివృద్ధి చేస్తామన్నారు. రాథోడ్‌ శంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. వెంకట్రాంనాయక్‌ ఆధ్వర్యంలో తాగునీటి వసతి కల్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నియోజక వర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, బీజేపీ నిర్మల్‌ జిల్లా అధ్యక్షుడు రితీష్‌రాథోడ్‌, మాజీ ఎంపీపీ కలాం, నాయకులు శంకర్‌నాయక్‌, శేషారావు నాయక్‌, సర్పంచ్‌ శారద, రూప్‌లాల్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చిత్తరంజన్‌ ఆధ్వర్యంలో సీఐలు సత్యనారాయణ, రమేష్‌తో పాటు ఎస్సైలు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Mar 19 , 2026 | 11:09 PM