Share News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.8.9కోట్ల గంజాయి పట్టివేత, ఇద్దరి అరెస్టు

ABN , Publish Date - Apr 01 , 2026 | 04:17 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టయింది. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానంతో డీఆర్‌ఐ....

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.8.9కోట్ల గంజాయి పట్టివేత, ఇద్దరి అరెస్టు

శంషాబాద్‌ రూరల్‌, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో గంజాయి స్మగ్లింగ్‌ ముఠా గుట్టు రట్టయింది. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులపై అనుమానంతో డీఆర్‌ఐ, కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టారు. వారు తీసుకొచ్చిన బ్యాగేజీని పరిశీలించగా.. అత్యంత ఖరీదైన హైడ్రోఫోనిక్‌ వీడ్‌ (ప్రత్యేక పద్ధతుల్లో సాగు చేసిన గంజాయి)ని గుర్తించారు. సోదాల్లో మొత్తం 25 కిలోల 45 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో దీని విలువ దాదాపు రూ.8.9 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భారీ మొత్తంలో గంజాయి పట్టుబడటం ఎయిర్‌పోర్టులో కలకలం రేపింది. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Apr 01 , 2026 | 04:17 AM