Share News

శంషాబాద్‌లో రన్‌వేపై ఆగిపోయిన చార్టెడ్‌ ఫ్లైట్‌!

ABN , Publish Date - Apr 07 , 2026 | 05:28 AM

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌‌కు ముందు సాంకేతిక లోపంతో ఓ చార్టెడ్‌ ఫ్లైట్‌ రన్‌ వే నిలిచిపోవడంతో.. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది...

శంషాబాద్‌లో రన్‌వేపై ఆగిపోయిన చార్టెడ్‌ ఫ్లైట్‌!

  • ఐదు విమానాల రాకపోకలకు అంతరాయం..

శంషాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్‌‌కు ముందు సాంకేతిక లోపంతో ఓ చార్టెడ్‌ ఫ్లైట్‌ రన్‌ వే నిలిచిపోవడంతో.. పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు వీటీ-ఆర్‌ఈఎం చార్టెడ్‌ ఫ్లైట్‌ ఐదుగురితో రాయపూర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటలకు రాయపూర్‌ బయల్దేరి వెళ్లాలి. కానీ విమానం ట్యాక్సివే నుంచి ప్రధాన రన్‌వే వైపు వెళ్తుండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో రన్‌వే మీదే ఆగిపోయింది. రంగంలోకి దిగి విమానాశ్రయ అధికారులు.. ఆ చార్టెడ్‌ ఫ్లైట్‌ను టోయింగ్‌ చేసి పక్కకు తరలించారు. ఈ నేపథ్యంలోనే ల్యాండ్‌ కావాల్సిన రెండు విమానాలు కాసేపు గాల్లో చక్కర్లు కొట్టగా.. మరో మూడు విమానాల టేకాఫ్‌ ఆలస్యమైంది. దాదాపు రెండు గంటల తర్వాత సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో చార్టెడ్‌ విమానం రాయపూర్‌ బయలుదేరి వెళ్లింది.

Updated Date - Apr 07 , 2026 | 05:28 AM