Share News

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారం

ABN , Publish Date - Jul 23 , 2026 | 06:13 AM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఓ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారం

  • విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా దారుణం

  • బాధితురాలిని రోడ్డుపై వదిలేసి నిందితుడి పరారీ

  • శంషాబాద్‌లో ఘటన.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా డ్రైవర్‌ అరెస్టు.. రిమాండ్‌

శంషాబాద్‌ రూరల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్న ఓ ఎయిర్‌లైన్స్‌ ఉద్యోగినిపై క్యాబ్‌ డ్రైవర్‌ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఆర్జీఐఏ పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి జుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఈనెల 19న సదరు ఉద్యోగిని (25) విధులు ముగించుకుని ఇంటికి వెళ్లడానికి శంషాబాద్‌లో ఒక క్యాబ్‌ ఎక్కింది. మార్గమధ్యంలో డ్రైవర్‌ వాహనాన్ని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలిని రోడ్డుపై వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్జీఐఏ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని వనపర్తి జిల్లాకు చెందిన ఎర్రపోగు ప్రశాంత్‌కుమార్‌ (23)గా గుర్తించారు. మంగళవారం ప్రశాంత్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని రాజేంద్రనగర్‌ కోర్టులో హాజరుపరచగా, మెజిస్ట్రేట్‌ అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఆర్జీఐఏ అవుట్‌పోస్టు సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 23 , 2026 | 06:15 AM