Share News

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసంపై నీలినీడలు

ABN , Publish Date - Aug 09 , 2026 | 10:21 PM

యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఽ రెండేళ్ల క్రితం ఈ పథకం తెరమీదకు వచ్చింది. దరఖాస్తులు చేసుకు న్న వారికి అధికారులు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు.

kumaram bheem asifabad- రాజీవ్‌ యువ వికాసంపై నీలినీడలు
లోగో

- లబ్ధిదారుల ఎంపిక పూర్తయ్యాక పంపిణీ వాయిదా

- పథకం అమలుపై స్పష్టత ఇవ్వని సర్కార్‌

ఆసిఫాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా చేపట్టిన రాజీవ్‌ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.ఽ రెండేళ్ల క్రితం ఈ పథకం తెరమీదకు వచ్చింది. దరఖాస్తులు చేసుకు న్న వారికి అధికారులు ఇంటర్వ్యూలు సైతం నిర్వహించారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో రాయితీ రుణాలతో స్వయం ఉపాధి పొందుదామనుకున్న యువత ఆశలు ఆవిరిరవుతున్నా యి. వాస్తవానికి ఈ పథకాన్ని ప్రభుత్వం జూన్‌ 2, 2025న రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు రాయితీ రుణాల మంజూరు పత్రాలను పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అఖరి క్షణంలో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసు కుంది. రాయితీ రుణాల పంపిణీపై సందిగ్ధత నెల కొనడంతో దరఖాస్తుదారులు ప్రభుత్వ కార్యాల యాల చుట్టు తిరుగుతున్నారు.

- 15 మండలాల నుంచి..

యువ వికాసం పథకానికి జిల్లాలోని 15 మండ లాల నిరుద్యోగ యువత దరఖాస్తులు చేసుకున్నా రు. ఈ పథకం కిద ఎస్సీ, ఎస్టీ. బీసీ ఈడబ్యూఎస్‌, మైనార్టీలకు రూ.50 వేల నుంచి మొదలుకొని రూ.4లక్షల వరకు వివిధ రకాల యూనిట్ల కొనుగోలుకు బ్యాంకు లింకేజీతో కూడిన రుణాలు అందించాలని నిర్ణయించింది. రూ.50 వేల యూనిట్‌కు 100 శాతం సబ్సిడీ, రూ. లక్ష నుంచి రూ.2 లక్షల రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల పైనుంచి రూ.4 లక్షల యూనిట్ల కోసం70 సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఇందుకోసం రేషన్‌కార్డు కలిగిన నిరుపేద కుటుంబంలోని ఒక రికి మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌తో పాటు అప్‌లైన్‌ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించారు. దీంతో ఈ పథకానికి జిల్లాలో వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగులు 29,756 మంది దరఖాస్తులు చేసు కున్నారు. లబ్ధి దారుల ఎంపిక కోసం మండలాల వారీగా రుణ లక్ష్యాలను ఖరారు చేసి అధికారులు, బ్యాంకు సిబ్బందితో కలిసి ఇంటర్వ్యూలు సైతం నిర్వహిం చారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిం చాయి. జూన్‌ 2న తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. కానీ నేటికి పథకం అమలుకు నోచుకోలే దు. పథకం అమలుపై సర్కార్‌ స్పష్టత ఇవ్వక పోవడంతో దఖాస్తుదారుల్లో అసంతృప్తి నెలకొన్నది.

- జిల్లా వ్యాప్తంగా..

జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 335 గ్రామ పంచాయితీలలో రాజీవ్‌ యువ వికాసం పథకానికి వివిధ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత 29.75 6 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో 3,040 మంది. బెజ్జూరులో 1,788 , చింతలమానేపల్లిలో 1,907 , దహెగాంలో 1,622 , జైనూర్‌లో 1,860 ,కాగజ్‌నగర్‌లో 5,486 , కెరమెరిలో 1,761 , కౌటాలలో 2, 327 , లింగాప ూర్‌లో 793 ,పెంచికల్‌పేటలో 1,072 , రెబ్బెనలో 2,827, సిర్పూర్‌-టిలో 1,616 , తిర్యాణిలో 1,690 , వాంకిడిలో 1,074 , సిర్పూర్‌-యూలో 893 మంది రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రాజీవ్‌ యువ వికాసం పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు 2025 జూన్‌ 2వ తేదీన మంజూరు పత్రాలు అందజేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. కానీ ఊహించని అడ్డంకులు, క్షేత్రస్థాయి సమస్యల కారణంగా పంపిణీ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో పథకం కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది దరఖాస్తుదారుల్లో అయోమయాన్ని, భవిష్యత్తుపై ఆందోళనను రేకెత్తించింది. జూన్‌ 2న జరిగిన తెలంగాణ క్యాబినెట్‌ సమావేశంలో ఈ పథకం అమలు తీరుపై విస్తృతంగా చర్చ జరిగినప్పటికీ ఇప్పటి వరకు దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. ఇది యువత ఆశలను మరింత సన్నగిల్లంపజేస్తోంది. రెండు నెలలు కావస్తున్నా ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో దరఖాస్తుదారులు పథకం అమలుపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలుపై ఎలాంటి ప్రకటన రాకపోవడంతో మరింత సమయం పట్టే అవకాశాలున్నట్లు స్పష్టమవుతున్నది.

కాలయాపన చేయడం సరికాదు..

- ఎ చిరంజీవి, సీపీఐ జిల్లా నాయకుడు

రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం రుణా లు మంజూరులో కాలయాపన చేయడం సరికాదు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందేందుకు రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. రుణాలు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దరఖాస్తుదారులను ప్రభుత్వం మోసం చేయడం సరికాదు. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Aug 09 , 2026 | 10:21 PM