Share News

ఆ ఆడియో నకిలీది.. ఏఐతో సృష్టించారు

ABN , Publish Date - Jun 15 , 2026 | 04:23 AM

టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై, పార్టీకి చెందిన మహిళా నేతపై, కార్యకర్తలపై గానీ తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రాష్ట్రప్రభుత్వ...

ఆ ఆడియో నకిలీది.. ఏఐతో సృష్టించారు

  • టీపీసీసీ క్రమశిక్షణ కమిటీకి షబ్బీర్‌ అలీ వివరణ

హైదరాబాద్‌/కామారెడ్డి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌పై, పార్టీకి చెందిన మహిళా నేతపై, కార్యకర్తలపై గానీ తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని రాష్ట్రప్రభుత్వ సలహాదారు మహమ్మద్‌ షబ్బీర్‌ అలీ అన్నారు. తాను అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారమవుతున్న ఆడియో క్లిప్‌ నకిలీదని తెలిపారు. ఈ మేరకు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైౖర్మన్‌ మల్లు రవికి ఆదివారం లేఖ ద్వారా ఆయన వివరణ సమర్పించారు. ఈ నెల 10 తెలుగు స్ర్కైబ్‌ అనే ఎక్స్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేసిన 54 సెకన్ల ఆడియో క్లిప్‌ పూర్తిగా నకిలీదని తెలిపారు. కృత్రిమ మేధ (ఏఐ) వాయిస్‌ క్లోనింగ్‌ సాంకేతికతతో దానిని సృష్టించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలో చేరిన గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి నేతృత్వంలోని ఒక వర్గం కామారెడ్డి జిల్లాలో గ్రూప్‌ రాజకీయాలను ప్రోత్సహిస్తూ పార్టీని బలహీనపరుస్తోందని ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడితో తనకు గత నాలుగు దశాబ్దాలుగా సోదర సమానమైన సంబంధాలున్నాయని ఆయన తెలిపారు.

Updated Date - Jun 15 , 2026 | 04:23 AM