క్రమశిక్షణ చర్యల కమిటీ ముందు హాజరైన షబ్బీర్
ABN , Publish Date - Jun 22 , 2026 | 04:20 AM
కామారెడ్డి కాంగ్రెస్ నేతల వివాదానికి సంబంధించి తన మీద వచ్చిన ఫిర్యాదు, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ..
తన మీద వచ్చిన ఫిర్యాదులపై వివరణ
హైదరాబాద్, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : కామారెడ్డి కాంగ్రెస్ నేతల వివాదానికి సంబంధించి తన మీద వచ్చిన ఫిర్యాదు, ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ.. ఆదివారం గాంధీభవన్‌లో టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ ముందు హాజరయ్యారు. పార్టీ వర్గాల్లో కలకలం రేపిన వివాదాస్పద ఆడియో టేపుల్లో వాయిస్ తనది కాదని, తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, తన ప్రతిష్ఠను దిగజార్చడానికి కొందరు ప్రత్యర్థులు కుట్రపూరితంగా ఈ ఆడియో టేపుల్ని సృష్టించి, వైరల్ చేశారని వివరణ ఇచ్చారు. షబ్బీర్ అలీపైన ఫిర్యాదు చేసిన కామారెడ్డి నేత చంద్రశేఖర్‌రెడ్డి కూడా కమిటీ ముందు హాజరయ్యారు. ఇద్దరితో సుదీర్ఘంగా చర్చించిన కమిటీ.. వారి మధ్య సంధి కుదిర్చినట్లు తెలుస్తోంది. పరస్పరం చేతులు కలిపిన నేతలు.. పార్టీ కోసం కలిసే పనిచేసిందుకు అంగీకరించినట్లు సమాచారం.