మురుగునీరు... పోయే దారేది..!
ABN , Publish Date - Jul 19 , 2026 | 10:18 PM
జిల్లా కేం ద్రంలోని హైటెక్‌సిటీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లే క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్‌ౄసిటీ వెంచర్ వ్యాపారులు చేసిన తప్పిదం వల్ల అక్క డ నివాసం ఉంటున్న ప్రజలు దశాబ్దాల కాలంగా ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
హైటెక్‌సిటీలో రోడ్లపై పారుతున్న మురుగునీరు
భూగర్భ పైపులు పగిలి పైకి వస్తున్న డ్రైన్ వాటౄర్
ఇబ్బందులు పడుతున్న కాలనీ వాసులు
మంచిర్యాల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేం ద్రంలోని హైటెక్‌సిటీలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లే క ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. హైటెక్‌ౄసిటీ వెంచర్ వ్యాపారులు చేసిన తప్పిదం వల్ల అక్క డ నివాసం ఉంటున్న ప్రజలు దశాబ్దాల కాలంగా ఇ బ్బందులు పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. హైటె క్ సిటీలో అనేక బహుళ అంతస్తుల భవనాల నిర్మా ణం జరుగగా, 800 కుటుంబాలు, సుమారు మూడు వేల జనాభా నివాసం ఉంటున్నారు. కాలనీ అంతటికీ వెంచర్ ఏర్పాటు చేసిన వ్యాపారులు ఒకటే సామూహిక సెఫ్టిక్ నిర్మించి వదిలి వేశారు. సెప్లిక్ ట్యాంకు నుంచి మురుగు నీరు బయటకు వెళ్లేందుకు ఔట్ లైన్ నిర్మించకపోవడంతో అండర్ గ్రౌండ్ పైపులు నిండి చాంబర్ల ద్వారా రోడ్లపైకి చేరుతోంది. ఆ నీరంతా రో డ్లపై నుంచి నేరుగా రాముని చెరువులోకి చేరుతుండటంతో అది కలుషితం అవుతోంది. దీంతో కాలనీ అం తా తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. కాలనీ వాసుల ఆందోళనల కారణంగా వెంచర్ వ్యాపారులు నాలుగైదు ఏళ్ల క్రితం సెప్లిక్ ట్యాంకు నుంచి రాముని చెరువు మత్తడి వరకు ఔట్ లైన్ నిర్మించినా అది మూన్నాళ్ల ముచ్చటగానే తయారైంది. ప్రస్తుతం అది నిరుపయోగంగా మారింది. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో చి న్నపాటి జల్లులకే రోడ్లపైకి నీరు చేరుతుండటంతో ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. ప్రతియేటా ఇ దే తంతు జరుగుతున్నా...ఇప్పటిదాకా ఈ సమస్యల పై పాలకులుగానీ, అధికారులుగానీ దృష్టిసారించ కపోవడం శోచనీయం.
నిధులు కేటాయించినా ఫలితం శూన్యం....
నివాస గృహాల నుంచి సెఫ్టిక్ ట్యాంకు వెళ్లే పైపులైన్లు పగిలిపోవడంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రైనే జీ నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా రెండు చోట్ల నుంచి రెండు వేర్వేరు మురుగు కాలువల నిర్మాణానికి గతం లో రూ. 12 లక్షల నిధులు కేటాయించారు. వాటితో పాటు ఛాంబర్ల మరమ్మతుల కోసం మరో రూ. 2 లక్షలు కేటాయించారు. ఈ రెండు కాలువల నిర్మాణం పూర్తయితే మురుగు నీరు నేరుగా సెఫ్టిక్ ట్యాంకు చే రి, అక్కడి నుంచి ఔట్ లైన్ ద్వారా బయటకు వెళ్లేది. దీంతో సమస్యకు పరిష్కారం లభించేది. అయితే రెం డు మురుగు కాలువలు నిర్మించే రోడ్డు చెరువు శిఖం భూమి అంటూ అప్పట్లో నీటిపారుదలశాఖ అధికారు లు అభ్యంతరం తెలిపారు. సదరు రోడ్డును పూర్తిగా తవ్వి, డ్రైనేజీలు నిర్మించకుండా అడ్డుకున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు డ్రైనేజీ నిర్మాణాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.
రోడ్డు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్....
హైటెక్‌సిటీలో ఓ వైపు డ్రైనేజీ వాటర్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, మరో వైపు రోడ్లు గుంతలు పడి మానసిక వేదనకు గురవుతున్నారు. మంచిర్యాల -బెల్లంపల్లి జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న కా లనీ ముఖద్వారం నుంచి ప్రధాన అంతర్గత రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహన చోధకు లు జంకుతున్నారు. గుంతల్లో నుంచి వాహనాలు నడపడం కష్ట సా ధ్యంగా ఉందంటూ వారు వాపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మె ల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు రూ. 1.87 కోట్లతో రోడ్డు నిర్మాణానికి నిధు లు మంజూరు చేయించారు. త్వరలో పనులు ప్రారంభం కాను న్నాయి. మొన్నటి మునిసిపల్ ఎన్నికల సమయంలో కాలనీ వాసులకు ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే రోడ్డు నిర్మాణానికి పూనుకోవడంపట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు మంజూరు చేయించి సమస్యలను పరి ష్కరించనున్న మాదిరిగానే డ్రైనేజీల ద్వారా బయటకు వస్తున్న మురుగు నీటి సమస్యను సైతం త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
పరిష్కారం చూపాలి...
దశాబ్దాలుగా డ్రైనేజీ సౌకర్యంలేక ఇబ్బందులు పడుతున్న తమకు కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వా సులు కోరుతున్నారు. నివాస గృహాల నుంచి వెలువడే మురుగు నీరు బ యటకు వెళ్లేలా ప్రత్యామ్నాయం ఏర్పాటు చే యాలని వారు వేడుకుంటున్నారు. వెంచర్ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.