Share News

ఏడవ రోజు విద్యా విజయోత్సవం

ABN , Publish Date - May 17 , 2026 | 11:28 PM

మండ ల పరిధిలోని తూడుకుర్తి జడ్పీహెచ్‌ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఏడవ రోజు బడిబాట విద్యా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించా రు.

ఏడవ రోజు విద్యా విజయోత్సవం
వంగూరు : వర్షిణికి ప్రతిభాపురస్కారం అందజేస్తున్న డీఈవో రమేష్‌ కుమార్‌

- పది, ఇంటర్‌లో టాపర్లకు ఘన సన్మానం

కందనూలు, మే 17 (ఆంధ్రజ్యోతి) : మండ ల పరిధిలోని తూడుకుర్తి జడ్పీహెచ్‌ పాఠశాల ప్రాంగణంలో ఆదివారం ఏడవ రోజు బడిబాట విద్యా విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహించా రు. ఈ సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు 500 మార్కులు దాటిన నాజ్మిన్‌ 562, సుఫియా న్‌, దినేష్‌లు 557 మార్కులు సాధించడంతో ప్రధానోపాధ్యాయుడు రఘు ఘనంగా సత్కరిం చారు. 500 మార్కులు దాటిన 16మంది విద్యా ర్థులను మెమెంటో, పుష్పగుచ్ఛాలతో సన్మానిం చారు. సీనియర్‌ ఉపాధ్యాయులు సత్యనారాయ ణ, అంజయ్య, అల్వాల వెంకట నరసింహారెడ్డి, మురళీధర్‌గౌడ్‌, సఫియా సుల్తానా, గోపాలా చారి, జి.రమేష్‌, మజార్‌ పాల్గొన్నారు.

ఫ నాగర్‌కర్నూల్‌ టౌన్‌, (ఆంధ్రజ్యోతి) : ప్ర భుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య అందు తుందని మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాలలో విద్యా వారోత్సవాల ముగింపు కార్య క్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన పూర్వ విద్యార్థులను ఆయన సన్మానించారు. కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్‌ మదన్‌మో హన్‌, అధ్యాపకులు అంజయ్య, వని త, ఉమాదేవి, కోదండరాం, రామకృ ష్ణ, ఏఓ ఇర్ఫాన్‌ పాల్గొన్నారు.

ఫ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాలలో వి ద్యావారో త్సవాలను భాగంగా కళా శాల ప్రిన్సిపాల్‌ మాధవి అధ్యక్షతన నిర్వ హించారు. ఇంటర్‌ వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఘనంగా స న్మానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కౌన్సిల ర్‌ చంద్రకళ, అధ్యాపకులు, విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

ఫ పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యా వారోత్సవాల చివ రి రోజు ఆదివారం విద్యా విజయోత్సవం కార్యక్ర మం కళాశాల ప్రిన్సిపాల్‌ భగవేణి నరసింహు లు అధ్యక్షతన పెద్దకొత్తపల్లి గ్రామ ఉప సర్పం చ్‌ మంజుల ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బైపీసీ ద్వితీయ సంవత్సరం పరీక్షల్లో కళాశాల టాపర్‌గా నిలిచిన విద్యార్థిని ఎడ్ల భార్గవిని రూ. 5వేలు నగదు ప్రోత్సాహంతో శాలువాతో ఘ నంగా సన్మానించారు.

ఫ వంగూరు, (ఆంధ్రజ్యోతి) : పది పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చి మండల టాపర్‌గా ని లిచిన వంగూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల వి ద్యార్థి గున్నోజి వర్షిణిని నాగర్‌కర్నూల్‌లో జరిగిన కార్యక్రమంలో డీఈవో రమేష్‌ కుమార్‌ నుంచి ప్రతిభాపురస్కాం అందుకుంది. ఎంఈవో కొండ ల్‌రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు.

ఫ తెలకపల్లి, (ఆంధ్రజ్యోతి) : మండల టాపర్‌గా నిలిచిన జడ్పీహెచ్‌ఎస్‌ పెద్దపల్లికి చెందిన సందు స్వాతి (571 మార్కుల)ని డీఈవో రమేష్‌ కుమార్‌ సన్మానించారు. ఎంఈ వో శ్రీనివాస్‌రెడ్డి, ఉపాధ్యాయులు చాంద్‌పాషా, చంద్రశేఖర్‌, భాస్కర్‌ తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - May 17 , 2026 | 11:28 PM