kumaram bheem asifabad- పంచాయతీలకు సొంత ఖాతాలు
ABN , Publish Date - Nov 28 , 2026 | 10:51 PM
గ్రామ పంచాయతీల ఆదాయంపై ఇక వాటికే పూర్తి అధికారాలు దక్కనున్నాయి. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతీ పైసా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమకానున్నాయి. గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా సొంత ఖాతాల్లో జమ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది.
- జీవో 43ను విడుదల చేసిన ప్రభుత్వం
వాంకిడి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఆదాయంపై ఇక వాటికే పూర్తి అధికారాలు దక్కనున్నాయి. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసే ప్రతీ పైసా నేరుగా గ్రామ పంచాయతీ ఖాతాల్లోనే జమకానున్నాయి. గ్రామ పంచాయతీలు ఆదాయాన్ని ట్రెజరీలో కాకుండా సొంత ఖాతాల్లో జమ చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కలిగించింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ చట్టాన్ని సంవరించింన ప్రభుత్వం ఇటీవల జీవో నంబరు 43ను విడుదల చేసింది. ఆయా గ్రామ పంచాయతీల్లో అమలయ్యే జనరల్ ఫండ్ నిధులను వినియోగించే బాధ్యతలను పాలక వర్గాలకే అప్పగించింది. అందుకోసం ప్రత్యేకంగా బ్యాంకుల్లో ఖాతాలు తెరవాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ దిశగా పంచాయతీ కార్యదర్శలు, సర్పంచ్‌లు దృష్టి సారించారు. గ్రామ పంచాయతీల్లో నిధుల విడుదల సులభతరం కానున్నదని సర్పంచ్ లు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.
- ఫ్రిజింగ్ సమస్యలు దూరం..
ప్రభుత్వ నిర్ణయంతో జనరల్ ఫండ్ వినియో గానికి ట్రెజరీ ప్రీజింగ్ సమస్యలు దూరం కానున ్నాయి. గ్రామ పంచాయతీల్లో ఆస్తిపన్ను, తైబజార్, వారంతపు సంతలు, లేఅవుట్లు, మ్యుటేషన్లు, భవన నిర్మాణ అనుమతులు, ట్రేడ్ లైసెన్సులు ఈదితర సేవల ద్వారా వచ్చే ఆదాయాన్ని పంచాయతీ జనరల్ ఫండ్ కింద జమ చేస్తారు. ఇప్పటి వరకు ఈ నిధులు ట్రెజరీ ఖాతాల్లో జమఅయ్యేవి. వాటిని డ్రా చేసుకునేందకు కార్యదర్శులు చెక్కులు రాసి ట్రెజరీకి పంచాల్సి ఉండేది. కానీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఖాతాలను ఫ్రీజింగ్‌లో పెట్టడంవల్ల నిధులు మంజూరు కావడంలో జాప్యం జరుగుతుం డేది. దీంతో నిధులు కోసం నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చేది. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో కాలపరిమితి దాటితే చెక్కులు చెల్లుబా టు కాని పరిస్థితులు ఉండేవి. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వం జనరల్ ఫండ్‌ను వినియో గిం చుకునే బాధ్యతను పాలకవర్గాలకే అప్పగించడంతో ఫ్రీజింగ్ సమస్యకు పరిష్కారం లభించనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త విధానంతో పంచాయతీల ఆదాయం వాటి ఖాతాల్లోనే అందు బాటులో ఉండనుంది. దీంతో నిధుల వినియోగంలో జాప్యం తగ్గడమే గాక స్థానిక అవసరాలకు అను గుణంగా ఖర్చుపెట్టుకునే వెసులుబాటు కలగనుంది.
ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
- బెండారె కృష్ణా, బంబార సర్పంచ్
గ్రామ పంచాయతీలు సొంత ఖాతాలు తెరిచి డబ్బు డ్రా చేసుకునే వెసులు బాటు కల్పించడాన్ని స్వాగతిస్తున్నాం. ట్రెజరీల్లో ఫ్రీజింగ్ కారణంగా చెక్కు లు సకాలంలో పాస్ కాక ఇబ్బందులు ఎదురయ్యేవి. కొత్త ఖాతాలతో ఈ సమస్య పరిష్కారం కానున్నది. ఇప్పటికే పంచాయతీ ఖాతాల్లో ఉన్న డబ్బును కొత్త ఖాతాల్లోకి బదిలా చేసేలా ప్రభుత్వం చర్యలు తీసు కోవాలి.