Share News

కాంగ్రెస్‌లో పైసలున్నోళ్లకే పదవులు!

ABN , Publish Date - Feb 17 , 2026 | 07:10 AM

కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ వనపర్తికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత చీర్ల చందర్‌ మండిపడ్డారు.

కాంగ్రెస్‌లో పైసలున్నోళ్లకే పదవులు!

  • తన భార్యతో కౌన్సిలర్‌ పదవికి రాజీనామాచేయించిన వనపర్తి సీనియర్‌ నేత చందర్‌

వనపర్తి, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌లో డబ్బులున్న వారికే పదవులు కట్టబెడుతున్నారంటూ వనపర్తికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నేత చీర్ల చందర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పార్టీ బలోపేతం కోసం ఎంతో కష్టపడ్డామని.. తమ కుటుంబం తాతల కాలం నుంచి ఈ పార్టీ కోసమే పనిచేసిందన్నారు. అయినా తమకు అన్యాయమే జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. చైర్మన్‌ పదవి ఆశించి భంగపడటంతో.. సోమవారం తన భార్య రజిని కౌన్సిలర్‌ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. తన భార్యతో కలిసి చందర్‌ మీడియాతో మాట్లాడుతూ మొదట్నుంచి ఎమ్మెల్యే మేఘారెడ్డి చైర్మన్‌ పదవి తమకే ఇస్తానని మాట ఇచ్చారని, చివరకు మిత్తీలకు డబ్బులిచ్చిన వారికి చైర్మన్‌ పదవి కట్టబెట్టడం బాధాకరమని వాపోయారు.

Updated Date - Feb 17 , 2026 | 07:11 AM